Share News

Mancherial: సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:50 PM

మంచిర్యాలక్రైం, అక్టోబరు 7 (ఆంధ్ర జ్యోతి): సైబర్‌మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ఝా సూచించారు.

Mancherial: సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

- రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా

మంచిర్యాలక్రైం, అక్టోబరు 7 (ఆంధ్ర జ్యోతి): సైబర్‌మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ఝా సూచించారు. బుధవారం మంచిర్యాలపట్టణంలోని ప్రభుత్వడిగ్రీ కళా శాలలోని విద్యార్థులకు సైబర్‌మోసాలు, సామాజిక మాధ్యమాల వినియోగంపై అవ గాహనకల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ తది తర సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం, కుటుంబ వివరాలు, ఫోటోలు, ఆర్థికవివరాలు వంటి సునిత్నమైన సమాచా రాన్ని పంచుకోవద్దన్నారు. ఎవరైనా ఫోన్‌చేసి బ్యాంకు ఖాతా, ఓటీపీ నంబర్లు అడిగితే చెప్పవద్దన్నారు. అను మానాస్పద ఫోన్‌కాల్స్‌, మెసెజ్‌ లింకులకు స్పందించ కుండా పాస్‌, థింక్‌, వెరిఫై విధానాన్ని పాటించాల న్నారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే 1930కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థులు జాగ్రత్తలు పాటించడంతో పాటు సైబర్‌భద్రత గురించి తల్లిదం డ్రులకు, బంధువులకు, స్నేహితులకు అవగాహన కల్పించారు. అనంతర పాస్‌ ఫర్‌ సేఫ్టీ -పాస్‌ థింక్‌ వెరిఫై నినాదంతో రూపొందించిన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌, సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌ ఏసీపీ రంగారెడ్డి, మంచిర్యాల టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రమోద్‌రావు, రామగుండం సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 11:50 PM