Share News

Mancherial: ప్రభుత్వఆసుపత్రిలో ఆయుర్వేద వైద్య శిబిరం

ABN , Publish Date - Sep 23 , 2026 | 11:25 PM

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని ప్రభు త్వ ఆసుపత్రిలో బుధవారం మెగాఆయు ర్వేద వైద్యశిబిరం నిర్వహించారు.

 Mancherial:  ప్రభుత్వఆసుపత్రిలో ఆయుర్వేద వైద్య శిబిరం

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని ప్రభు త్వ ఆసుపత్రిలో బుధవారం మెగాఆయు ర్వేద వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబి రానికి అదనపుకలెక్టర్‌ చంద్రయ్య హాజరై ఆయుర్వేద వైద్యసేవలు, ఔషదాలను పరి శీలించి, వాటివినియోగం గురించి వైద్యుల ను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లా డుతూ ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన భవిష్యత్‌ ఉంటుందన్నారు. ప్రతీ ఒక్కరు యోగా, ధ్యానం చేయాలన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న సద రం శిబిరాన్ని పరిశీలించి వైద్యపరీక్షలను పరిశీలించారు. నిబంధనల ప్రకారం ప్రక్రి యను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌, ఆర్‌ఎంవో శ్రీధర్‌, జిల్లాఆయుర్వేద వైద్యాధికారి నీరజ, జిల్లా ప్రోగ్రాం అధికారి రవీందర్‌రాథోడ్‌, ఆయుష్‌వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2026 | 11:25 PM