Mancherial: కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా
ABN , Publish Date - Nov 16 , 2026 | 11:42 PM
నస్పూర్, నవంబరు 16 (ఆంధ్ర జ్యోతి): ఆశావర్కర్లకు వేతనాలు పెంచా లని, ఉద్యోగభద్రతకల్పించాలని బీఆర్టీ యూ, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.
- సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నస్పూర్, నవంబరు 16 (ఆంధ్ర జ్యోతి): ఆశావర్కర్లకు వేతనాలు పెంచా లని, ఉద్యోగభద్రతకల్పించాలని బీఆర్టీ యూ, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట సోమవారం డిమాండ్‌చేస్తూ ఆయా నాయకుల ఆధ్వర్యంలో ఆశావర్కర్లు ధర్నా నిర్వహించి అధికారికి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆశాకార్యకర్తలకునెలకురూ.18వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ పెన్షన్‌సామాజిక భద్రతకల్పించాలన్నారు. పెం డింగ్‌లో ఉన్న బకాయిలు, ప్రోత్సాహకాలను వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాని పక్షంలో డిసెంబరు 15నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతామన్నారు. ధర్నా కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా ఇన్‌చార్జీ పెట్టెం లక్ష్మణ్, సంధ్య, సీఐటీయూ నాయకులు సమ్మక్క, తదితరులు పాల్గొన్నారు.