Share News

Mancherial: నేర రహిత సమాజమే లక్ష్యం..

ABN , Publish Date - Oct 01 , 2026 | 11:52 PM

మందమర్రిటౌన్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): నేర రహిత సమాజమే తమ లక్ష్యమని రామగుండం పోలీస్‌కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ఝా పేర్కొన్నారు.

Mancherial:  నేర రహిత సమాజమే లక్ష్యం..

-రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా

మందమర్రిటౌన్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): నేర రహిత సమాజమే తమ లక్ష్యమని రామగుండం పోలీస్‌కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ఝా పేర్కొన్నారు. గురువారం మందమర్రి పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. సీసీ కెమె రాల పనితీరును పర్యవేక్షించారు. కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీపీ మాట్లాడుతూ 5ఎఫ్‌ విధానాన్ని సమర్ధవం తంగా అమలు చేయాలని, సింగరేణి సంస్థ ఉన్న ప్రాంతాల్లో అన్ని రంగాల వారు ఉంటారని తెలిపారు. ఈ ప్రాంతంలో రైలుమార్గం ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసు కువచ్చి విక్రయిస్తున్నారని, దీంతో నిఘా పెట్టి చాలా మందిని పట్టుకున్నామన్నారు. గంజాయి విక్రయిం చినా, సేవించినా, రవాణా చేసిన కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేయడమే తమ కర్తవ్యమ న్నారు. సీసీ కెమెరాలు, సైబర్‌మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కోల్‌బెల్ట్‌ పోలీస్‌స్టేషన్‌లకు తాను ప్రత్యేకంగా సలహాలు, సూచనలు ఇస్తున్నానని తెలి పారు. ఆన్‌లైన్‌లో రికార్డుల నమోదును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. రాత్రి పూట పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహించాల న్నారు. పాతనేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. దొంగతనాలు అరికట్టడం కోసం ప్రత్యేక విధా నాలను అవలంభిస్తున్నామన్నా రు. పాతనేరస్తుల జీవన విధా నంపై నిఘా ఉంచామన్నారు. ప్రజల కోసమే పోలీ సులు పనిచేస్తున్నారనే విషయాన్ని గుర్తించుకుని పోలీసులకు ప్రజలందరు సహకరించాలన్నారు. అంతకుముందు సీపీకి ఎస్‌ఐ నరేష్‌ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలి కారు. సీపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆయన వెంట మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, ఎస్‌ఐలు ఉన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 11:52 PM