Share News

విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:27 PM

విత్తనమేళా ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి సబ్‌కలెక్టర్‌ మనోజ్‌కుమార్‌ అన్నారు.

విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలి
కన్నాలలో రైతులకు విత్తనాలు అందిస్తున్న బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌కుమార్‌

- బెల్లంపల్లి సబ్‌కలెక్టర్‌ మనోజ్‌కుమార్‌

బెల్లంపల్లి, జూన 23 (ఆంధ్రజ్యోతి): విత్తనమేళా ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి సబ్‌కలెక్టర్‌ మనోజ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం కన్నాల రైతు వేదికలో విత్తన మేళాను ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 30 వరకు అన్ని రైతు వేదికల్లో విత్తనమేళా ఉంటుందన్నారు. వరిలో డిమాండ్‌ ఉన్న విత్తనాలను మాత్రమే రైతులు కొనుగోలు చేసి సాగు చేయాలని, వాటినే ప్రభుత్వం ప్రోత్సహిస్తుం దని సూచించారు. అనంతరం విత్తన స్టాళ్లను పరిశీ లించారు. రైతులకు సబ్సిడీపై కంది విత్తనాలను అం దజేశారు. కార్యక్రమంలో కన్నాల సర్పంచు మల్లమ్మ, ఉపసర్పంచు సూరమ్మ, సహకార సంఘం చైర్మన చింత స్వామి, వ్యవసాయ సహాయ సంచాలకులు రాజానరేందర్‌, ఏవో ప్రేమ్‌కుమార్‌, ఉద్యానవన అధికారి అర్చన ఏఈవోలు తిరుపతి, గౌసియాబేగం, విత్తన డీలర్లు పాల్గొన్నారు.

హాజీపూర్‌: మండలంలోని గుడిపేటలోని రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళాలో ఆత్మ చైర్మన సింగతి మురళి, జిల్లా వ్యవసాయాధికారి సురేఖ కంది పంట మినికిట్స్‌ను రైతులకు అందించారు. కార్యక్రమంలో ఏడీఏ కృష్ణ, ఏఎంసీ చైర్మన పద్మము ని, ఎఫ్‌పీడో డైరెక్టర్‌ శంకర్‌, సర్పంచులు శ్రీలతరా మారావు, రాజేష్‌, భూమన్న, కార్పొరేటర్లు కమలశ్రీ నివాస్‌గౌడ్‌, లగిశెట్టి రాజన్న పాల్గొన్నారు.

దండేపల్లి: మండలంలోని ముత్యంపేట, గూడెం, ద్వారక, లింగాపూర్‌ రైతు వేదికలో నిర్వహించిన విత్తనమేళాలో మండల వ్యవసాయ అధికారి గొర్ల అంజితకుమార్‌, ఎంపీవో విజయప్రసాద్‌, ఏఈవోలు శ్రీకన్య, నరేష్‌కుమార్‌, శ్రావణ్‌, సాయి, సర్పంచులు రైతులు పాల్గొన్నారు.

జన్నారం: మండలంలో జరిగిన కార్యక్రమంలో రైతులకు ఏడు రకాల వరి వంగడాలపై మండల వ్యవసాయ అధికారి అంజిత కుమార్‌ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన దుర్గం లక్ష్మీనారాయణ, వ్యవసాయశాఖ అధికారులు అక్రముల్లా, మండల నాయకులు ఫసియుల్లా, నందునాయక్‌, రైతులు పాల్గొన్నారు.

నస్పూర్‌: నస్పూర్‌ పట్టణం సీతారాంపల్లిలో మం గళవారం రైతు వేధిక వద్ద విత్తన మేళాను స్థానిక కార్పోరేటర్‌ సురిమిల్ల సౌమ్య-వేణు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు ధర్ని మల్లేష్‌, దొనిప ల్లి లింగయ్య, ఆత్మ డైరెక్టర్‌ కొక్కిరాల మోహన రావు, జిల్లా ఉద్యానవన అధికారి అనిత, వ్యవసాయశాఖ అధికారి మహేందర్‌, ఏఈవో నేహా, ఏవో రజిత, విత్తన కంపెనీల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

తాండూర్‌: కొత్తపల్లి రైతు వేదికలో మంగళవారం విత్తనమేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్ర మంలో సర్పంచు వెంకటేష్‌, ఏవో సుష్మ, ఏఈవో వెంకటేష్‌, డీలర్లు పాల్గొన్నారు.

కాసిపేట: విత్తనమేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆత్మ చైర్మన రౌతు సత్తయ్య అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచులు సుగుణ, శంకర్‌, ఏవో ప్రభాకర్‌, ఉపసర్పంచు సందీప్‌, ఏఈవోలు నాగదీ ప్తి, సాగర్‌, విత్తన డీలర్లు పాల్గొన్నారు.

చెన్నూరు: మండలంలోని కిష్టంపేట, శివలింగా పూర్‌, అంగ్రాజ్‌పల్లి గ్రామాల్లోని రైతు వేదికల్లో మంగళవారం విత్తన మేళాలను నిర్వహించారు. ఏడీఏ బానోత ప్రసాద్‌, ఏడీఏ గోపి, ఏవో యామిని, ఏఈవో వైష్ణవి, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.

కోటపల్లి: మండలంలోని కోటపల్లి, సిర్సా రైతు వేదికల్లో జరిగిన కార్యక్రమంలో మండల వ్యవసా యాధికారి రత్న సాయికృష్ణరెడ్డి, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

భీమారం: భీమారంలో నిర్వహించిన కార్యక్రమం లో సర్పంచు ఉష్కమల్ల విజయలక్ష్మీపున్నంచంద్‌, త హసీల్దార్‌ సదానందం, ఏఈవో విశ్వం పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:27 PM