Share News

పరిసరాల పరిశుభ్రత పాటించండి

ABN , Publish Date - May 12 , 2026 | 10:28 PM

పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌. అనిత అన్నారు.

పరిసరాల పరిశుభ్రత పాటించండి
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచవో డాక్టర్‌ అనిత

డీఎంహెచవో డాక్టర్‌ అనిత

జైపూర్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌. అనిత అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జైపూర్‌ పవర్‌ ప్లాంట్‌ లో వైద్య ఆరోగ్య అవగాహన శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 14 ఏళ్లు నిండిన బాలికలకు గర్భాశయ క్యాన్సర్‌ నివారణ కోసం హెచవీపీ వ్యాక్సిన ఉచితంగా అందిస్తున్నామని దీని ప్రాముఖ్యతను ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. వ్యాధులపై అప్రమతత వాతావరణ మార్పులతో వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెనగున్నా వంటి కీటకజనిత వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. ఎండలు పెరుతున్న నేపథ్యంలో ప్రజలు డీహైడ్రేషన బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. అసంక్రమణ వ్యాధులైన బీపీ, డయాబెటిస్‌ వ్యాధి గ్రస్తులను గుర్తించేందుకు స్ర్కీనింగ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు ముస్తాఫా, సింధూర, పద్మజ, సీహెచఓ రాజిరెడ్డి, పవర్‌ ప్లాంటు అధికారు లు, సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్‌లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2026 | 10:28 PM