వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:54 PM
మహాశివరాత్రి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. భక్తులు పలు గోదావరి నదిలోని పుష్కర ఘాట్ల వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం వివిధ దేవాలయాల్లోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు.
మహాశివరాత్రి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. భక్తులు పలు గోదావరి నదిలోని పుష్కర ఘాట్ల వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం వివిధ దేవాలయాల్లోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు, పండ్లు నీళ్లను అందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
హాజీపూర్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ముల్కల్ల పుష్కరఘాట్‌కు భక్తులు పోటెత్తారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. .
లక్షెట్టిపేట: వేకువజాముననే పట్టణ సమీపంలోని గోదావరి తీరానికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి పుణ్య స్నానాలు ఆచరించారు. పట్టణంలోని శ్రీసాంభశివాల యంతోపాటు సాయిబాబా, కన్యకాపరమేశ్వరి ఆలయా లు భక్తులతో కలిటకిటలాడాయి.
దండేపల్లి: దండేపల్లి మండలం గూడెం, ద్వారక, ల క్ష్మీకాంతపూర్, గుడిరేవు గ్రామాల గోదావరి తీరాల్లో పుణ్యస్నానాలతో భక్తజన సందోహంతో నిండిపోయాయి. గూడెంలో సత్యనారాయణస్వామి ఆలయంతో పాటు పలు ఆలయాలను భక్తులు సందర్శించి పూజలు చెల్లించుకున్నారు.
నస్పూర్: నస్పూర్‌లోని సీతారాంపల్లి గోదావరి నదిలో వేలాది మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ఇసుక లింగాలకు పూజలు చేశారు. ఇసుకలో చాలా దూరం నడవలేక చాలా మంది భక్తులు నల్లాల కిందనే స్నానాలు చేశారు. నస్పూర్ పట్టణం లోని ఆలయాల్లో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని విశ్వనాధ ఆలయం, గోదావరి తీరంలోని గౌతమేశ్వర ఆలయం, శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
జన్నారం: మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపల్లి, చింతగూడ, తిమ్మాపూర్, గోదావరినదితీరాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మారం, గంగమ్మతల్లితో పాటు హనుమాన్, బాదంపల్లి హనుమాన్‌మందిరంతో పాటు పొన్కల్ వెంకటేశ్వర ఆలయం, తిమ్మాపూర్, చింతగూడ గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బెల్లంపల్లి రూరల్: మండలంలోని కన్నాల బుగ్గరాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గణపతి పూజతో పాటు మహన్యాసకపూర్వక రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు, అఖండ బిల్వార్చనలు నిర్వహించారు. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్ర్తాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమర్పించారు.
కాసిపేట: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ఆదివారం మద్దిమాడ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.