Share News

సంపూర్ణత అభియాన్‌ 2.0 లక్ష్యసాధనకు సమష్టిగా కృషిచేయాలి

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:01 AM

సంపూర్ణత అభియాన్‌ 2.0 పథకం కింద తిర్యాణి బ్లాక్‌లో కార్యక్ర మాల లక్ష్య సాధనకు అధికారులు సమష్టిగా కృషి చే యాలని కలెక్టర్‌ కె హరిత సూచించారు.

సంపూర్ణత అభియాన్‌ 2.0 లక్ష్యసాధనకు సమష్టిగా కృషిచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత

- కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, మార్చి 16(ఆంధ్రజ్యోతి): సంపూర్ణత అభియాన్‌ 2.0 పథకం కింద తిర్యాణి బ్లాక్‌లో కార్యక్ర మాల లక్ష్య సాధనకు అధికారులు సమష్టిగా కృషి చే యాలని కలెక్టర్‌ కె హరిత సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ భవన సముదాయంలోని వీసీ హాల్‌లో ఢిల్లీ నుంచి వచ్చిన నీతి ఆయోగ్‌ అధికారి అష్ణ శర్మతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నీతి ఆయోగ్‌ కార్యక్రమం సంపూర్ణత అభియాన్‌ 2.0 కింద చేపడుతున్న ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంలో నిర్దేశిత లక్ష్యాలను అధికారులు సమన్వయంతో పూర్తి చేసే విధంగా కృషిచేయాలని తెలిపారు. హెల్త్‌ న్యూట్రిషియన్‌, పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, వ్యవసాయ రంగంలో సాగునీటి వసతి, పశువులకు 100 శాతం టీకాలు అందజేత, ఆర్థిక చేయూత, నైపుణ్యతాభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టామన్నా రు. ఆకాంక్షిత తిర్యాణి బ్లాక్‌ కార్యక్రమంలో భాగంగా గిరిజన, పీవీటీజీ గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులపై అవగాహన కార్యక్ర మాలు చేపట్టి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహి స్తామని తెలిపారు. పిల్లలకు పౌష్టికాహారం, పాఠశాల లో మౌలిక వసతుల కల్పన, అంగన్‌వాడీ కేంద్రాల్లో మూత్రశాలలు, తాగునీరు, బాలికలకు ప్రత్యేక మూత్ర శాలల నిర్మాణం, సామాజిక అభివృద్ధి, మారుమూల గిరిజన గ్రామాలకు రవాదారుల అనుసంధానం, ఇంట ర్నెట్‌ సౌకర్యం, ఇంటింటికి తాగునీరు వంటి కార్యక్ర మాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని వివరిం చారు. కార్యక్రమంలో గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, డీఎంహెచ్‌వో సీతారాం, డీఏవో వెంకటి, పంచాయతీ రాజ్‌ ఈఈ ధర్మేందర్‌, జిల్లా సమన్వయ కర్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

ఏజెంట్ల జాబితాను అందించాలి

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం సమర్థవంతం గా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమ తరపు న బూత్‌స్థాయి ఏజెంట్ల వివరాలను అందించాలని కలెక్టర్‌ కె హరిత సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఏప్రిల్‌ నెలలో చేపట్టిన ప్రత్యేక సమగ్రతలో భాగంగా ఓటర్ల వివరాలు సేకరించేందుకు బూత్‌ స్థాయి అధికారులు ప్రతి ఇంటింటికి వెళ్తారని తెలిపారు. సంబంధిత ఓటరు తమ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని, ఈ క్రమంలో రాజకీయ పార్టీలు తమ పార్టీల నుంచి బూత్‌ స్థాయి ఏజెంట్ల జాబితాను అందించాలని, వారి సహకారంతో సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయ వంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

జన గణన విధానంపై

అవగాహన పెంచుకోవాలి

జిల్లాలో జరిగే ఇళ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బం దీగా నిర్వహించేలా జనాభా గణన విధానంలోని ప్రతీ అంశంపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌ కె హరిత సూచించారు. సమీకృత కలెక్టరేట్‌ భవన సము దాయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారు లు, ఆర్డీవో, మండలాధికారులు, అదనపు అధికారులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణను అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇళ్ల గణన లో భాగంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జనాభా గణన ఫార్మట్‌లో ఉన్న ప్రతీ అంశంపై అవగాహన పెంచుకొని ఏన్యుమ రేటర్లు, సూపర్‌వైజర్లు లేవనెత్తిన అంశాలపై వారికి నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జనాభా గణన విధానాన్ని డిజిటలై జేషన్‌ పద్ధతిలో నిర్వహించడం జరు గుతుందని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో లక్ష్మీనా రాయణ, డీపీవో భిక్షపతి, తహసీల్దార్‌, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 12:01 AM