భూసర్వే సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:31 PM
భూ సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సులను సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు.
- కలెక్టర్ కె హరిత
ఆసిఫాబాద్‌రూరల్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సులను సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం జిల్లాలోని ధ్యానాపూర్ గ్రామంలో నిర్వహిం చిన అవగా హన సదస్సుకు ఆర్డీవో లోకేశ్వరరావు, భూ కొలతల శాఖ సహాయ సంచాలకులు విజయ్‌కుమార్, తహసీ ల్దార్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సర్వే సరిహద్దుల చట్టం ప్రకారం నక్షా, గ్రామ హద్దులు లేని ధ్యానాపూర్ గ్రా మాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి సమగ్ర భూసర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామానికి స్పష్టమైన హద్దులు, సరిహద్దులు లేని కారణంగా రెవెన్యూ అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసి జీపీఆర్‌ఎస్ సాంకేతిక ద్వారా వ్యవసాయ భూములను సమగ్రంగా సర్వే చేసి హద్దులు నిర్ణయించడం జరుగు తుందని తెలిపారు. సర్వే ప్రక్రియ పూర్తి అయిన తరు వాత భూ వివాదాలు తగ్గి రైతులకు భూములపై స్పష్ట మైన హక్కులు లభిస్తాయని, రైతులకు మేలు జరుగు తుందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఇతర గ్రామాలకు ఆదర్శంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సగమ్ర భూ సర్వే కార్యక్రమం ద్వారా రైతులకు దీర్ఘకాలిక లాభాలు కలుగుతాయని, భూముల కొలతలు కచ్చితం గా నమోదు చేయడం వల్ల భవిష్యత్‌లో రికార్డుల నిర్వ హణ సులభతరం అవుతుందని తెలిపారు. ఈ పైలెట్ ప్రాజెక్టు విజయవంతంగా నిర్వహిస్తే ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని, గ్రామ ప్రజలు అవగా హన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారు లు పాల్గొన్నారు.
బ్యాంకర్లు రుణ లక్ష్యాలను సాధించాలి
ఆసిఫాబాద్: బ్యాంకర్లు జిల్లాకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించి జిల్లా అభివృ ద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కె హరిత అన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో 2025-26 సంవత్సర మూడో త్రైమాసిక సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్య రంగాల్లో ఇవ్వాల్సిన రుణ లక్ష్యాలను పెంపొందించాలని అర్హు లైన, లబ్ధిదారలకు త్వరగా రుణాలు మంజూరు చేసి లక్ష్య సాధనకు కృషిచేయాలని తెలిపా రు. ప్రధాన మంత్రి ముద్ర రుణాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధిఖి కేటాయవించిన రుణాలు, ప్రధా న మంత్రి స్వయం ఉపాధి పథ కం, ప్రధాన మంత్రి విశ్వకర్మ వంటి ప్రభుత్వ పథకాలు, జన సురక్ష పథకాల లక్ష్యాలను త్వర గా పూర్తి చేయాలని తెలిపారు. 2025-26 ఆర్థిఖ సంవత్సరానికి 3.23 కోట్ల రుణ లక్ష్యాలను గాను ఇప్పటి వరకు 49 శాతంతో 1581 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందని, లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధిం చే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాల ని తెలిపారు.
గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం మంజూరైన నిధులను బ్యాంకులు దుర్వినియోగం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆర్థిక సంవత్సరానికి నాబార్డు వారు రూపొందించిన పటెన్షి యల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పథకాన్ని అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నాబార్డు డీడీఎం వీరభద్రుడు, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఎల్‌డీఓ రాములు, స్టేట్ బ్యాంకు ఆర్‌ఎం రితేష్ గుప్తా, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ రాజేశ్వర్‌జోషి, జిల్లా పరిశ్రమ శాఖ జీఎం రమాదేవి తదితరులు పాల్గొన్నారు.