Kumuram Bheem Asifabad: జనాభా లెక్కింపులో చార్జ్ అధికారుల పాత్ర కీలకం
ABN , Publish Date - Oct 22 , 2026 | 11:53 PM
ఆసిఫాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జనాభా గణనలో చార్జ్ అధికారుల పాత్ర కీలక మైందని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జనాభా గణనలో చార్జ్ అధికారుల పాత్ర కీలక మైందని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొ ని మాట్లాడారు. జనాభా ప్రక్రియలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు చార్జ్ అధికారులుగా వ్యవహ రిస్తారని జనాభా గణన ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చార్జ్ అధికారులు వ్యవహరించాలన్నారు. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ జనాభా గణన ప్రక్రియ రెండు విడతలుగా ఉంటుం దని మొదటివిడతలో నివాస గృహల గణన, రెండో విడతలో జనాభా గణన ఉంటుందని తెలిపారు. సమావేశంలో కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్‌చౌదరి, సీపీవో గురువయ్య, జడ్పీ సీఈవో లక్ష్మినారాయణ, డీపీవో భిక్షపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పండుగ సాయన్న చరిత్ర నేటితరానికి
స్ఫూర్తిదాయకం
ఆసిఫాబాద్ : పెత్తందార్ల అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచిన ధైర్యశాలి పేదల ఆకలి తీర్చిన ఆపద్భాంధవుడు అణగారిన వర్గాల హక్కులకై పోరాడిన బహుజన చైతన్య స్ఫూర్తి ప్రదాత పండుగ సాయన్న అని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా వీరుడు సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ హర్ష్‌చౌదరి, డీపీవో భిక్షపతిగౌడ్, సీఈవో లక్ష్మినారయణ, సీపీవో గురువయ్య, బీసీ సంక్షేమాధికారి నదీం తదితరులు పాల్గొన్నారు.