Kumuram Bheem Asifabad: దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:44 PM
ఆసిఫాబాద్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకంకింద రాష్ట్రంలోని ప్రతికుటుంబా నికి ప్రభుత్వం రూ.5లక్షల జీవితబీమా వర్తింప చేస్తుందని, రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోం దని, దరఖాస్తుల స్వీకరణప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్‌జాజు అన్నారు.
ఆసిఫాబాద్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకంకింద రాష్ట్రంలోని ప్రతికుటుంబా నికి ప్రభుత్వం రూ.5లక్షల జీవితబీమా వర్తింప చేస్తుందని, రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోం దని, దరఖాస్తుల స్వీకరణప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్‌జాజు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాలకలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గురువారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇంది రమ్మ కుటుంబ జీవితబీమా పథకం ప్రారంభం కానున్నదని అన్నారు. దరఖాస్తులను ప్రతీ గ్రామపంచాయతీ, మున్సిపాలి టీలలో ప్రత్యేకకౌంటర్లు ఏర్పాటుచేసి స్వీకరించాలన్నారు. ఈ పథకానికి తెలంగాణలో పుట్టి ఆధార్‌కార్డు కలిగిన ప్రతీఒక్కరు అర్హులని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.
పారదర్శకంగా నమోదు చేయాలి..
జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకం కింద దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ హర్ష చౌదరితో కలిసి ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ రెవెన్యూడివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, మున్సిప ల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సీసీలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్‌లో నమోదు, కౌంటర్ల ఏర్పాటు అంశాలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఈ పథకం రేషన్‌కార్డు కలిగిన వారితోపాటు రేషన్‌కార్డులేని వారికి కూడా వర్తిస్తుందన్నారు. 18నుంచి 59సంవత్సరాల వరకు వయస్సు ఉన్న వ్యక్తి బీమా వ్యక్తిగా ప్రతిపాదించబడతారని భీమా పొందే వ్యక్తి స్వయంగా దరఖాస్తుపై సంతకం చేసి నామినీ వివరాలను తెలియపరిచి దరఖాస్తులు అందజేయలన్నారు. సమావేశంలో సీపీవో గురు వయ్య, డీపీవో భిక్షపతిగౌడ్, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.