Kumuram Bheem Asifabad: పురుడు పోసిన ఆయమ్మ
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:30 PM
దహెగాం, నవంబరు 9 (ఆంధ్ర జ్యోతి): పురిటినొప్పులతో బాధపడుతూ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వస్తే వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంతో చివరికి ఆసుపత్రిలో పనిచేసే ఆయమ్మనే కాన్పుచేసి సంఘటన దహెగాం మండలకేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.
- అందుబాటులో లేని వైద్యసిబ్బంది
దహెగాం, నవంబరు 9 (ఆంధ్ర జ్యోతి): పురిటినొప్పులతో బాధపడుతూ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వస్తే వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంతో చివరికి ఆసుపత్రిలో పనిచేసే ఆయమ్మనే కాన్పుచేసి సంఘటన దహెగాం మండలకేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని అమర్‌గోండ గ్రామానికి చెందిన జునగరి తులసి సోమవారం తెల్లవారు జామున పురిటినొప్పులతో బాధపడింది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు 108అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అయితే దహెగాం మండల కేంద్రంలోని అంబులెన్స్ అందుబాటులో లేదని, బెజ్జూరు నుంచి రావడానికి గంటసమయం పడుతుందని సమా ధానం చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు అమర గొండ గ్రామంనుంచి ఆటోలో దహెగాం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. ఉదయం7.30గంటల నుంచి 8.30 గంటలవరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యసిబ్బంది ఎవరూరాలే దు. గర్భిణి తులసికి పురిటి నొప్పు లు తీవ్రంకావడంతో ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో గతంలో పనిచేసిన ఆయమ్మ విధుల నుంచి దిగిపోయి అదేఆరోగ్య కేంద్రంలో రోజువారీ ఆయాగా పనిచేస్తోంది. ఆమె ఇళ్లు ఆసుపత్రికి ఆనుకొనే ఉండడంతో తలసి కుటుంబసభ్యులు వెళ్లి ఆమెను తీసుకొచ్చారు. ఆయమ్మ తనకున్న పరిజ్ఞానంతో సాధారణ ప్రసవం చేసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతానికి తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కావడంలేదని మండ లవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విష యంలో ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండు చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి సిడాం నాగేందర్‌ను వివరణ కోరగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివరాలు సేకరించి విధులకు రాని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.