Share News

kumuram bheem asifabad : బీజేపీ ప్రయోజనాల కోసమే ఈసీ పనిచేస్తోంది

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:44 PM

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ప్రయోజనాల కోసమే ఈసీ వ్యవహరిస్తున్నదని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఆరోపించారు.

kumuram bheem asifabad :  బీజేపీ ప్రయోజనాల కోసమే ఈసీ పనిచేస్తోంది

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ప్రయోజనాల కోసమే ఈసీ వ్యవహరిస్తున్నదని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఆరోపించారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు సోమవారం జిల్లాకేంద్రంలో కాంగ్రె స్‌పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ దండె విఠల్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, మాజీఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీ మాజీ అధ్య క్షుడు విశ్వప్రసాద్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు మంగ, విశ్వనాథ్‌తో కలిసి నిరసన ర్యాలీ, కలెక్టరేట్‌ ఎదు ట ధర్నా, ఈసీ దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసేందుకు కుట్రచేస్తున్న దన్నారు. ఓటర్ల జాబితా విషయంలో పారదర్శకత లేకుం డా నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యా నికి ప్రమాద కరమన్నారు. బీజేపీకి రాజకీయంగా లాభం చేకూరే విధంగా ఓటర్ల జాబితాలో మార్పులు జరుగుతున్నాయనే అనుమానాలు బలపడు తున్నాయన్నారు. ఎన్నికల కమిషన్‌ స్వతంత్రత, పారదర్శకతను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్‌పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు. అంతకుముందు అంబేద్కర్‌చౌక్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఈసీ కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీచైర్మన్లు మంగ, విశ్వనాథ్‌, దేవయ్య, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ అబ్దుల్లా, జడ్పీ మాజీచైర్మన్‌ సిడాం గణపతి, టీపీసీసీ ప్రధానకార్యదర్శి భాస్కర్‌, డీఎంసీ వైస్‌చైర్మన్‌ మాంతయ్య, మాజీఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తారీఖ్‌, మురళీ, ఇమ్రాన్‌, చిట్ల నారాయణ, దత్తు, చరణ్‌, హర్షద్‌ హుస్సేన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:44 PM