Share News

kumuram bheem asifabad : విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:41 PM

దహెగాం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జ్యోతి అన్నారు.

kumuram bheem asifabad :  విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

దహెగాం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జ్యోతి అన్నారు. సోమవారం నషాముక్త్‌ యువ ఫర్‌ వికసిత్‌ కార్యక్రమాన్ని పురస్కరిం చుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. చక్కటి లక్ష్యా లతో చదువులు సాగించాలని సూచించారు. కార్య క్రమంలో వైద్యసిబ్బంది ప్రమీల, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.

బెజ్జూరు : యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సై విజయ్‌ అన్నారు. సోమవారం మండలంలోని సలుగుపల్లి చౌర స్తావద్ద మత్తుపదార్థాలపై యువతకు అవ గాహన కల్పించారు. ఈసందర్భంగా మాట్లా డుతూ గంజాయి, గుడుంబా, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాల న్నారు. వాటిని విక్ర యించిన వారి వివ రాలు అందించాలని సూచించారు.

వాంకిడి: గంజా యి రహిత సమాజ నిర్మాణానికి కృషిచే యాలని ఎన్‌ఎస్‌ఎస్‌ పీవోచంద్రయ్య సూచిం చారు. వాంకిడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులతో మాదకద్ర వ్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. సైబర్‌నేరాలపట్ల జాగ్రత్తగా ఉండాలని, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌, లింకులు, ఓటిపి, సందేశాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో స్టూడెంట్‌ కౌన్సి లర్‌ రాజమౌళి, అధ్యాపకులు సంతోష్‌, శ్రీధర్‌, కిరణ్‌కుమార్‌, తిరుపతి, సురెంద్రకుమార్‌, గోపాల్‌, విఠ్ఠల్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:41 PM