Share News

Kumuram Bheem Asifabad: విబీజీరాంజీ పథకంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:24 PM

కెరమెరి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): వీబీజీరాంజీ పథకంలో అలక్రమాలకు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె హరిత అన్నారు.

Kumuram Bheem Asifabad:  విబీజీరాంజీ పథకంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కె హరిత

-జిల్లా కలెక్టర్‌ కె.హరిత

కెరమెరి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): వీబీజీరాంజీ పథకంలో అలక్రమాలకు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. మండల కేంద్రంలో వీబీజీరాంజీ పథకంలో నిధుల దుర్వినియోగంపై అందిన ఫిర్యాదు మేరకు బుధవారం మండల పరి షత్‌ అభివృద్ధి కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వీబీజీరాంజీ పథకంలో సాంకేతిక సహాయకులు, క్షేత్ర సహాయకులు, కంప్యూటర్‌ఆపరేట్లు, మేట్లు, పథకంలో పనులు చేయ కున్నా, కూలీలు హాజరుకాకున్నా హాజరైనట్టు నిధులు కాజేశారని ఫిర్యాదు రావటంతో కార్యాలయాన్ని తనిఖీచేశామన్నారు. రికార్డులు, ఎంబీ బుక్‌లను పరిశీలించగా నిధులు కాజేసినట్టు తేలటంతో సిబ్బం దిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బందిపై చట్టరపరమైన చర్యలు తీసుకుంటామని తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీ డీవో సాయిరాంగౌడ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2026 | 11:24 PM