Share News

Kumuram Bheem Asifabad: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినచర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:42 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ నితికాపంత్‌ అన్నారు.

Kumuram Bheem Asifabad: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినచర్యలు తీసుకోవాలి

ఆసిఫాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ నితికాపంత్‌ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిం చిన నెలవారీ నేరసమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతికేసులో క్వాలిటీఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌తో నేరస్తులకు శిక్షపడేలా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌ కేసులను త్వరిత గతిన పూర్తి చేయలన్నారు. ప్రజలు వ్యాపార సముదాయలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించలన్నారు. మహిళలు, చిన్నారులు, సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాలు తీవ్ర మైన నేరాలపై ప్రత్యేకదృష్టి సారించి నేర నియం త్రణకు చర్యలు చేపట్టలన్నారు. బెట్టింగ్‌, జూదం, మట్కా, గంజాయిలాంటి అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని అదేశించారు. నిరంతరం వాహనాలను తనిఖీ చేసి మద్యం సేవించి వాహనాలను నడుపుతూ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిని గుర్తించి కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్‌, డీఎస్పీలు అశోక్‌, వహిదుద్దీన్‌, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2026 | 11:42 PM