Share News

Kumuram Bheem Asifabad: సైబర్‌నేరాల కట్టడికి పటిష్ట చర్యలు

ABN , Publish Date - Nov 23 , 2026 | 11:16 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): సైబర్‌నేరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నితికాపంత్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా సైబర్‌ వారియర్స్‌కు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

Kumuram Bheem Asifabad:  సైబర్‌నేరాల కట్టడికి పటిష్ట చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ నితికాపంత్‌

ఆసిఫాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): సైబర్‌నేరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నితికాపంత్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా సైబర్‌ వారియర్స్‌కు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సైబర్‌ నేరాల నియంత్రణలో సైబర్‌ వారియర్స్‌ కీలకపాత్ర పోషించాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తూ సైబర్‌నేరాల బారిన పడకుండా అప్రమత్తం చేయాలన్నారు. బాధితులకు సకాలంలో స్పందించి తగిన సాయం అందించాలన్నారు. సైబర్‌నేరాల నియంత్రణకు ప్రతీ ఒక్కరు బాధ్యతా యుతంగా పనిచేస్తూ ప్రజల్లో డిజిటల్‌భద్రతపై అవగాహన పెంపొందిం చాలని సూచించారు. కార్యక్రమంలో సైబర్‌క్రైం విభాగం సీఐ లింగయ్య, ఆర్‌ఎస్‌ఐ కిరణ్‌, ఎస్సై దివ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2026 | 11:16 PM