Share News

Kumuram Bheem Asifabad: విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలి

ABN , Publish Date - Nov 23 , 2026 | 11:44 PM

తిర్యాణి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లో విద్యను అభ్యసి స్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిం చాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు.

Kumuram Bheem Asifabad:  విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత

- కలెక్టర్‌ కె హరిత

తిర్యాణి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లో విద్యను అభ్యసి స్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిం చాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సోమవారం తిర్యాణి మండలకేంద్రంలో గల జడ్పీ ఉన్నతపాఠశా లను ఆకస్మకంగా తనిఖీచేసి అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ అదనపు గదుల నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకో వాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులను పలుప్రశ్నలు అడిగి వారి పఠనా సామార్థ్యాన్ని పరీక్షించారు. ఉపా ధ్యాయులు సిలబస్‌ను త్వరగా పూర్తిచేయాలని, విద్యా ర్థులకు అర్థమయ్యే విధంగా నాణ్యతతో కూడిన బోధ న అందించాలన్నారు. విద్యార్థులు వందశాతం హాజర య్యేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని తెలిపారు. అనంతరం మండలకేంద్రంలోని గల మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ బీమాపథక శిబిరాన్ని సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. అధికారులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు పలుసూచలను చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయా లని, రేషన్‌కార్డు కలిగిన ప్రతిఒక్కరు ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా చేయించుకోవా లని అన్నారు. ఆ దిశగా గ్రామాల్లో విస్తృతప్రచారం ప్రచారం చేపట్టాల న్నారు. టాంటాం నిర్వహించాలన్నారు. అనంతరం కార్యాలయ సమావేశ మందిరంలో లింగాపూర్‌, తిర్యాణి మండలాల్లో అమలవుతున్న టీజీఐ ఎల్‌పీ కార్యక్రమానికి సంబంధించిన శిక్షకులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ సమ్మిళిత జీవనోపాదుల కల్పనలో భాగం గా పథకం అమలు తీరు, లబ్ధిదారులకు అందుతున్న సహాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హు లైన నిరుపేదలను గుర్తించి, వారికి అవసరమైన ఆర్థిక చేయూతను అందించాలని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతినిరుపేదలకు జీవనోపాధి మెరు గుపడేలా క్షేత్రస్థాయిలో కృషిచేయాలన్నారు. కార్యక్ర మంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, మండల తహసీల్దార్‌ శ్రీనివాస్‌, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి నగేష్‌, మండల విద్యాధికారి అంజ య్య, డీపీఎం యశోద, ఎపీఎంలు శ్రీనివాస్‌, సూర్య కాంత్‌, వీబీజీరాంజీ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బాల్య వివాహాల నిర్మూలనకు

ప్రతీఒక్కరు కృషిచేయాలి

ఆసిఫాబాద్‌ : బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషిచేయాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సోమ వారం కలెక్టరేట్‌లో బాల్యవివాహాల ముక్త్‌భా రత్‌ వందరోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి చెందిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ బాల్యవివాహాలు.. బాలికల విద్య,ఆరోగ్యం,భవిష్యత్‌పైతీవ్రప్రభావం చూపుతాయని అన్నారు. బాల్యవివాహాల వలన బాలికలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని తెలిపారు. 18సంవ త్సరాలు నిండని బాలికలు 21సంవత్సరాలు నిండని బాలురకు వివాహలు చేయడం చట్టరిత్యా నేరమని అన్నారు. బాల్యవివాహాల నిషేదచట్టం-2006 ప్రకారం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌ డేవిడ్‌, డీఆర్వో వేణు, సీపీవో గురువయ్య, డీడీ అంబాజీ, డీపీవో భిక్షపతిగౌడ్‌, డీడబ్ల్యూవో స్వరూప, డీసీపీవో మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2026 | 11:44 PM