Kumuram Bheem Asifabad: ఆస్తిపన్ను వసూళ్లు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Nov 02 , 2026 | 11:28 PM
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లను వేగవంతం చేసి, నిర్దేశితలక్ష్యాలను వందశాతం సాధించాలని అదనపు కలెక్టర్ యువరాజ్‌మర్మాట్ అన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లను వేగవంతం చేసి, నిర్దేశితలక్ష్యాలను వందశాతం సాధించాలని అదనపు కలెక్టర్ యువరాజ్‌మర్మాట్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయామున్సిపాలిటీల కమిషనర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బం దితో ఆస్తిపన్నువసూళ్ల పురోగతిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సిబ్బం ది క్షేత్రస్థాయిలో వార్డులవారీగా పర్యటించి వంద శాతం పన్ను వసూలు పూర్తి చేయాలని అన్నారు. దీర్ఘకాలిక బకాయిలు ఉన్న వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బకాయిదారులను గుర్తించి ప్రత్యేకడ్రైవ్ నిర్వహించి పన్ను సేకరించాలని తెలి పారు. పట్టణ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగ కుండా సీడీఎంఎ పోర్టల్, డిజిటల్ మాధ్యమాల ద్వారా సులభంగా పన్నులు చెల్లించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. పన్ను వసూళ్లలో అలసత్వం వహించే అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్లు అంజయ్య, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.