Share News

Kumuram Bheem Asifabad: ప్రజలు రాక ప్రజావాణి వెలవెల

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:13 AM

వాంకిడి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజలు రాక వెలవెల బోతోంది. ప్రజలు పెద్దగా హాజరుకాకపో వడంతో కార్యక్రమం బోసిపోయింది.

Kumuram Bheem Asifabad:  ప్రజలు రాక ప్రజావాణి వెలవెల
ప్రజావాణిలో పాల్గొన్న అధికారులు

వాంకిడి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజలు రాక వెలవెల బోతోంది. ప్రజలు పెద్దగా హాజరుకాకపో వడంతో కార్యక్రమం బోసిపోయింది. ప్రారం భంలో మాత్రమే 22మంది ప్రజావాణిలో వివిధ సమస్యలపై దరఖాస్తు చేసుకోగా మిగితా ప్రజావాణి కార్యక్రమాల్లో కేవలం ఒకరిద్దరు తప్ప ప్రజలు ఎవరూ దరఖాస్తు చేసుకోవడానికి రావడంలేదు. గతసోమవారం నిర్వహించిన ప్రజా వాణిలో కేవలం రెండు దరఖాస్తు రాగా తాజాగా సోమవారం నిర్వ హించిన ప్రజావాణిలో కేవలం ఒక దరఖాస్తు మాత్రమే వచ్చింది. అయితే ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు ఎందుకు రావడంలేదు?. అధికారులు అందుబాటులో ఉండటం లేదా? సమస్యలు పరిష్కారం కావడంలేదా?. అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు తక్కువ సంఖ్యలో రావడానికి గల కారణాలను అధికారులు పరిశీలించి, ప్రజావాణిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Oct 27 , 2026 | 12:13 AM