Kumuram Bheem Asifabad: ' ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 23 , 2026 | 11:18 PM
ఆసిఫాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు.
ఆసిఫాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాఅదనపు కలె క్టర్ డేవిడ్, డీఆర్వో వేణుతోకలిసి అర్జీదా రుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దహెగాం మండలం హత్తిని గ్రామానికి చెందిన రంగు సందీప్ తాను సాగుచేస్తున్న ప్రభుత్వ భూమి కి పట్టామంజూరు చేయాలని కోరుతూ దర ఖాస్తు సమర్పించారు. లింగాపూర్ మండలం పీకతాండ గ్రామానికి చెందిన సరిత తన కూతురు పదవతరగతి చదువుతూ అనారో గ్యంతో మరణించిందని తన కుటుంబానికి ఉపాధి కల్పించాలని అర్జీ సమర్పించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని కాపువాడకు చెందిన తాజ్‌బేగం తనకు ఇందిరమ్మ ఇళ్లు మం జూరు చేయాలని దర ఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ మండలం కొమ్ముగూడ గ్రామానికి చెందిన మంజుల తన కు వితంతు పింఛను మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. రెబ్బెన మండలం ఎడవెల్లి గ్రామానికి చెందిన కార్నాథం పద్మ తన భర్త పేరిటగల భూమిని తన పేరిట పట్టామార్పిడి చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకం కింద రూ.5లక్షలు బీమా చేయించుకోవాలని తెలిపారు.