Kumuram Bheem Asifabad: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 10 , 2026 | 12:01 AM
ఆసిఫాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తు లను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరి ష్కరించాలని జిల్లాగ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు అన్నారు.
ఆసిఫాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తు లను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరి ష్కరించాలని జిల్లాగ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏఓ కిరణ్‌కుమార్‌తో కలిసి అర్జీలను స్వీకరిం చారు. వాంకిడి మండలం దాబా గ్రామానికి చెందిన కేశవ్ తాను 30ఏళ్లుగా సాగుచేస్తున్న పోడు భూమిని తనపేరిట పట్టా చేయాలని అర్జీఅందజేశారు. ఆసిఫాబాద్ మండలం ఈదులవాడ గ్రామపంచాయతీ పరిధిలోని సింగరావుపేట గ్రామప్రజలు తమ గ్రామానికి శాశ్వత రహదారిని నిర్మించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఆసిఫాబాద్‌మండలం బూర్గుడ గ్రామానికి చెందిన ప్రజలు తమగ్రామంలో పాఠశాల ఎదురుగాగల బెల్ట్‌షాపును తొలగిం చాలని కోరుతూ అర్జీ సమర్పించారు. తిర్యాణి మండలం మంగి గ్రామపంచాయతీ పరిధి లోని శ్రీరాంపూర్‌గూడగ్రామానికి చెందిన మడావిరోజా తనకు ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజే శారు. రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామా నికిచెందిన చిన్నుబాయి గ్రామశివారులో గతం లో తనకుమారుడి పేరిటగల పట్టా భూమిని తనపేరిట విరాసత్ పట్టాచేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.