Kumuram Bheem Asifabad: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 02 , 2026 | 11:26 PM
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా వాణిలో అందిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కె హరిత అన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా వాణిలో అందిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, డీఆర్వో వేణుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. చింతలమానే పల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన జుమ్మిడి రవీంద్ర ప్రకాష్ తనతండ్రి పేరిట గల పట్టాభూమిని తనకు తెలియకుండా ఇతరులు పట్టామార్పు చేసుకున్నారని ఈ విషయమై విచారించి తమకు న్యాయం చేయాలని దరఖాస్తు అందజేశారు. రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందినచ రత్నం శాంత తనకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, రెబ్బెన మండలం రాంపూర్ గ్రామానికి చెందిన డోంగ్రే రాజేంద్రప్రసాద్ తన పట్టా భూమి భూభారతిలోయ మిస్సింగ్ అని వస్తున్నందున సవరించి న్యాయంచేయాలని దరఖాస్తు సమర్పించారు. సిర్పూర్(టి) మండలకేంద్రానికి చెందిన షఫీ ముబారక్ తనకు మైనార్టీ గురుకులంలో డిప్యూటీ వార్డెన్ పోస్టు ఇప్పించాలని, కాగజ్‌నగర్ పట్టణం పోచమ్మబస్తీకి చెందిన దుర్గం మొండి తన భూమిలో ఇతరులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. కాగజ్‌నగర్ మండలం రాస్పెల్లి గ్రామానికి చెందిన ప్రజలు తమగ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల ముందు ఉన్న రోడ్డుకు స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, సిర్పూర్(యూ) మండల కేంద్రానికి చెందిన చిట్యాల రాజమణి తనకు కస్తూరీబాగాంధీ బాలికల విద్యాలయంలో వాచ్మెన్ పోస్టు ఇప్పిం చాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. సిర్పూర్(యూ) మండలం రుద్రకాషా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు పూర్తయిన బిల్లులు రావడంలేదని, జాబ్‌కార్డులు ఇప్పించాలని గ్రామస్తులు దరఖాస్తు సమర్పించారు. పెంచి కల్పేట మండలం దరోగపల్లిలో నాటుసారా తయారీ, అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కృష్ణవేణి, మహిళలు దరఖాస్తు సమర్పించారు.