Kumuram Bheem Asifabad: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 19 , 2026 | 11:26 PM
ఆసిఫాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపుకలెక్టర్ డేవిడ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపుకలెక్టర్ డేవిడ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జైనూరు మండల కేంద్రానికి చెందిన ఆత్రం శంభు మండల కేంద్రంలో నూతన మీసేవకేంద్రం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జిల్లా కేంద్రానికి చెందిన రవిందర్ తాను ప్రభుత్వ ఆసుపత్రిలో దోబిగా పనిచేస్తున్నానని తనకు ఆరోగ్యం సహకరించనందున తన కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని అర్జీ సమర్పించారు. సిర్పూర్(టి) మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన రాకేష్‌కుమార్ తనకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు. కాగజ్‌నగర్ మండలం అనుకోడ గ్రామానికి చెందిన శంకర్ తమ గ్రామంలోని పాఠశాలలో వంట గది నిర్మాణం చేశానని బిల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని బాలరక్షక్ భవన్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులపట్ల జరిగిన వేధింపుల ఘటనపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఆసిఫాబాద్ మండలం బూర్గుడ గ్రామానికి చెందిన మేకర్తి శ్రీనివాస్ అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డేవిడ్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుం టామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో వేణు పాల్గొన్నారు.