kumuram bheem asifabad : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:43 PM
ఆసిఫాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజా వాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చే దర ఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కె హరిత అన్నారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజా వాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చే దర ఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సోమ వారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్వో వేణు, డిప్యూటీ కలెక్టర్ జోస్తిన్ జోయల్‌తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిం చారు. దహెగాం మం డలం రనవెల్లి గ్రామానికి చెందిన కోలే స్వర్ణలత తనభర్త మృతి చెంది నందున అతని పేరిట ఉన్న భూమిని తన పిల్లల పేరిట పట్టాచేయాలని అర్జీ సమర్పిం చారు. ఆసిఫాబాద్ పట్టణం జనకాపూర్‌కు చెందిన కుమారస్వామి రోడ్డు ఆక్రమించుకొని ఫెన్సింగ్ ఏర్పాటుచేసి రోడ్డుకి వెళ్లకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాలనీవాసులు అర్జీ సమర్పించారు. జైనూరు మండలం మానిక్‌గూడకు చెందిన లలితబాయి ఇంది రమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అర్జీ సమ ర్పించారు. లింగాపూర్ మండలం పీర్లతాండకు చెందిన సర్పంచ్ కృష్ణ, ఉపసర్పంచ్ సీత కలిసి వార్డుమెంబర్లను సమావేశానికి పిలువ కుండా ఆమోదం లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను దుర్వినియోగం చేస్తున్నారని తక్ష ణమే వారిపై చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు అర్జీసమర్పించారు. చింతలమానేపల్లి మండలం రుద్రాపూర్‌కు చెందిన కల్పన తన పేరుమీద ఉన్న భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి పట్టాపాస్‌పుస్తకం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడ గ్రామానికి చెందిన మహేష్ అనే దివ్యాంగుడు తనకు ఈవీ బైక్ మంజూరు చేయాలని దరఖాస్తు చేశారు.