Kumuram Bheem Asifabad: పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ABN , Publish Date - Oct 19 , 2026 | 11:23 PM
ఆసిఫాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మిషన్ భగీరథ మానిక్‌గూడ వాటర్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఐదునెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లాప్రధాన కార్యదర్శి బోగేఉపేందర్ అన్నారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మిషన్ భగీరథ మానిక్‌గూడ వాటర్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఐదునెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లాప్రధాన కార్యదర్శి బోగేఉపేందర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం డీఆర్వో వేణుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు దివాకర్, కార్మికులు తిరుపతి, శ్రీకాంత్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.