Kumuram Bheem Asifabad: తిర్యాణి మండలాభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Oct 22 , 2026 | 11:55 PM
తిర్యాణి, అక్టోబరు 22 (ఆంధ్ర జ్యోతి): తిర్యాణి మండలంలో హోలిస్టిక్ రూరల్ డెవలప్ మెంటు ప్రాజెక్టు ద్వారా అభి వృద్ధి పనులకు చర్యలు చేపట్ట నున్నట్టు కలెక్టర్ కె హరిత తెలి పారు.
తిర్యాణి, అక్టోబరు 22 (ఆంధ్ర జ్యోతి): తిర్యాణి మండలంలో హోలిస్టిక్ రూరల్ డెవలప్ మెంటు ప్రాజెక్టు ద్వారా అభి వృద్ధి పనులకు చర్యలు చేపట్ట నున్నట్టు కలెక్టర్ కె హరిత తెలి పారు. గురువారం తిర్యాణి మండలకేంద్రంలో గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాల ఆవర ణలో ఏర్పాటుచేసిన హెచ్‌డీ ఎఫ్‌సీ బ్యాంకు నిధుల సహకా రంతో సీవైడీవో సంస్థ అమలు చేస్తున్న హోలిస్టిక్ రూరల్ డెవపల్‌మెంటు ప్రాజెక్టును ఆమె.. అదనపు కలెక్టర్ యువరాజ్‌మర్మాట్, హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధు లతోకలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ మండలంలోని మారుమూల గ్రామాల్లో విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, పోష కాహారం తదితర కీలకరంగాల్లో అవసరాలను గుర్తించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సర్పంచ్‌లు, స్వయం సహాయక సంఘాల మహిళల సహకారంతో అభివృద్ధిపనులు చేపట్టనున్నట్టు తెలిపారు. అభివృద్ధి లో భాగంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చటం, ప్రాథమిక మౌలికవసతుల కల్పన, ప్రభుత్వ అభివృద్ధికార్యక్రమాలను అర్హులైన ప్రజలకు అందించ టంపై చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగా గ్రామా ల్లో అవసరాలను గుర్తించి అభివృద్ధికి చర్యలు చేపట్టా లని తెలిపారు. మారుమూల లింగాపూర్, సిర్పూరు (యు) మండలాలపై కూడా దృష్టిసారించాలని తెలిపారు. అనంతరం భూముల రీసర్వేలో భాగంగా దుగ్గాపూర్‌శివారులో చేపట్టిన రీసర్వే ప్రక్రియను పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, మండలపరిషత్ అభివృద్ధి అధికారి నగేష్, హెచ్‌డీ ఎఫ్‌సీ రీజినల్ హెడ్ వెంకటేష్, జోనల్‌హెడ్ స్టీఫెన్, సీవైడీవో జాయింట్ డైరెక్టర్ నాగేశ్వర్‌రావు, సంబంధిత అధికారులు, సర్పంచ్‌లు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.