Kumuram Bheem Asifabad: ఈనెల 15వరకు జిల్లాలో జనజాతి గౌరవ దివస్ వేడుకలు
ABN , Publish Date - Nov 02 , 2026 | 11:29 PM
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జనజాతి గౌరవ దివస్ వేడుకలను పురష్కరించుకొని జిల్లాలో ఈనెల15వ తేదీవరకు వివిధ అవగాహన, సాంస్కృతిక, విద్యాకార్యక్రమాలను నిర్వహించేందుకు జిల్లాస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించా మని కలెక్టర్ కె హరిత అన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జనజాతి గౌరవ దివస్ వేడుకలను పురష్కరించుకొని జిల్లాలో ఈనెల15వ తేదీవరకు వివిధ అవగాహన, సాంస్కృతిక, విద్యాకార్యక్రమాలను నిర్వహించేందుకు జిల్లాస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించా మని కలెక్టర్ కె హరిత అన్నారు. సోమవారం కలెక్టరే ట్‌లో కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనుల చరిత్ర, సంస్కృతీ, సంప్రదాయాలు, భారత స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనుల పాత్రను ప్రజలకు తెలియజేయడంతోపాటు భగవాన్ బీర్సా ముండా తదితర గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్వరించుకోవడం, విద్యార్థులు, యువతలో గిరిజన వారసత్వంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 3నుంచి 15వ తేది వరకు వివిధ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమాలను రాష్ట్రస్థాయి వేదికతో పాటు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు, పాఠశాలలు, గిరిజన వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలలో నిర్వహించా లని తెలిపారు. జిల్లాలోని సంబంధితశాఖల అధి కారులు, విద్యాసంస్థలు, గిరిజన సంఘాలు, ప్రజాప్ర తినిదులు, యువత, ప్రజలు భాగస్వాములై జనజాతి గౌరవ దివస్‌వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, డీఆర్వో వేణు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ జోయల్, డీడీ జాదవ్‌అంబాజీ, డీఆర్‌డీవో దత్తారావు, ఎస్‌ఈ ఉత్తమ్ జాడే తదితరులు పాల్గొన్నారు.
గడువులోగా ‘సర్’ను పూర్తి చేయాలి
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్రముఖ్య ఎలకో్ట్రరల్ అధికారి కార్యాలయం నుంచి అదనపు ఎలకో్ట్రరల్ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్ణీతగడువులోగా పూర్తిచేయాలని,నోటీసులు, హియ రింగ్ ప్రక్రియ 100శాతం పూర్తిచేయాలని తెలిపారు. ఫారం 6,7,8దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయా లని, తొలగించిన ప్రతి ఓటరును తొలగించడానికి గల కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో వ్యాస రచన, రంగోళి పోటీలు నిర్వహించి బహు మతులు అందజేయాలని తెలిపారు. కలెక్టర్ మాట్లా డుతూ ‘సర్’ ప్రక్రియను జిల్లాలో నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలి పారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోయల్, ఎన్నికల అధి కారులు పాల్గొన్నారు.