Share News

Kumuram Bheem Asifabad: ఘనంగా ఇందిరాగాంధీ జయంతి

ABN , Publish Date - Nov 19 , 2026 | 11:55 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): దివంగత భారత మాజీప్రధాని ఇందిరాగాంధీ జయం తి వేడుకలను గురువారం పట్టణంలోని సందీప్‌ నగర్‌లో ఘనంగా జరుపుకున్నారు.

Kumuram Bheem Asifabad: ఘనంగా ఇందిరాగాంధీ జయంతి
కౌటాలలో ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న నాయకులు

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): దివంగత భారత మాజీప్రధాని ఇందిరాగాంధీ జయం తి వేడుకలను గురువారం పట్టణంలోని సందీప్‌ నగర్‌లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలువేసి ఘన నివాళు లర్పించి దేశాభివృద్ధికి చేసిన సేవలను కొనియడారు. కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీ ఉపాధ్య క్షుడు భీంరావు, పార్టీమండల అధ్యక్షుడు రాపర్తి మురళీ, సర్పంచ్‌ గంగారాం, మైనార్టీసెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సాజిద్‌, నాయకులు వసంత్‌రావు, జావీద్‌, బాలు, రాజేందర్‌, సాయి, అబ్బు, తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి : మండలకేంద్రంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఆమె చిత్రప టానికి ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె అందించిన సేవలను ఈసందర్భంగా పలువురు కొనియాడారు. కార్యక్రమంలో బంబార సర్పంచ్‌ కృష్ణాజీ, కాంగ్రెస్‌పార్టీ నాయకులు గుర్నులే మెంగాజీ, కమలేష్‌, దుర్గం హంసరాజ్‌, విలాస్‌, ఎస్‌ పెంటు, శివాజీ, దాదాజీ, గణేష్‌, మహేష్‌, మారుతి, ధ ర్ము, శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు : మండలకేంద్రంలో గురువారం ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోండ్ర జగ్గాగౌడ్‌, మాజీజడ్పీటీసీ పుష్పలత, సర్పంచు సోయం చిన్నయ్య, ఉపసర్పంచ్‌ ఆదర్శ్‌, నాయకులు శంకర్‌, రాజన్న, రామకృష్ణ, జావీద్‌అలీ, ఇస్తారి, సుగుణ, లక్ష్మి తదితరులు ఉన్నారు.

జైనూర్‌ : మండల కేంద్రంలో గురువారం మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జైనూర్‌ మార్కెట్‌కమిటీ చైర్మన్‌ కుడ్మేత విశ్వనాథ్‌రావు ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవను కొనియడారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శేక్‌ రషీద్‌, సర్పంచులు మడా వి మనోహర్‌, తోడసం రాజేందర్‌, ఆత్రం అయ్యు బాయి, సీనియర్‌ నాయ కులు మెస్రం అంబాజీ రావు, రాథోడ్‌ హరి తదితరులు పాల్గొన్నారు.

తిర్యాణి : తిర్యాణిలో మార్కెట్‌ డైరెక్టర్‌, జవ హర్‌ లాల్‌మంచ్‌ జిల్లా చైర్మన్‌ నైతం రాంచందర్‌, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు కొట్నాక గణపతి మాట్లాడుతూ దేశానికి ఇందిరాగాంధీ ఎనలేని సేవలు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి విజయ్‌, ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పులి కొమురయ్య, మాజీ మండల అధ్యక్షుడు అంకం, తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి: మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సుజాయిత్‌ఖాన్‌ ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల వైస్‌ ప్రసిడెంట్‌ జగన్నాథ్‌, ఆత్మకమిటి మెంబర్‌ గోగర్ల రాజయ్య, డీసీసీ జిల్లా కార్యదర్శి రాథోడ్‌ శంకర్‌, జిల్లా మైనార్టీ సెల్‌ సెక్రటరి పారూక్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన: మండల కేంద్రంలోని బస్టాండు వద్ద కాంగ్రెస్‌నాయకులు ఇందిరా గాంఽధీ దేశానికి చేసిన సేవల్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఆర్టీఎ మెంబర్‌ లావుడ్య రమేష్‌, సర్పంచ్‌ వెంకటేశం చారి, సీనియర్‌ నాయకులు మోడెం సుదర్శన్‌ గౌడ్‌, జిల్లా కార్యదర్శి దేవాజీ, జిల్లా కార్యవర్గ సభ్యులు చిరంజీవి గౌడ్‌, దుర్గం రాజేష్‌, సాయికుమార్‌ పాల్గొన్నారు.

కౌటాల: మండల కేంద్రంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2026 | 11:55 PM