Share News

Kumuram Bheem Asifabad: మౌలిక సదుపాయాల కల్పనపై హెచ్‌ఎంలు దృష్టిసారించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:00 AM

ఆసిఫాబాద్‌, నవం బరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వపాఠశాలల్లో విద్యార్థులకు వంద శాతం మౌలిక సదుపా యాల కల్పన దిశగా ప్రధానోపాధ్యాయులు దృష్టిసారించాలని కలె క్టర్‌ కె హరిత అన్నారు.

Kumuram Bheem Asifabad:  మౌలిక సదుపాయాల కల్పనపై హెచ్‌ఎంలు దృష్టిసారించాలి: కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌, నవం బరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వపాఠశాలల్లో విద్యార్థులకు వంద శాతం మౌలిక సదుపా యాల కల్పన దిశగా ప్రధానోపాధ్యాయులు దృష్టిసారించాలని కలె క్టర్‌ కె హరిత అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్‌ యువ రాజ్‌ మర్మాట్‌తో కలిసి విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంఈవోలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, సర్వశిక్ష అభియాన్‌ సిబ్బందికి ఏర్పాటుచేసిన యూడైస్‌ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి ప్రభుత్వపాఠశాలలో తాగునీరు, విద్యుత్‌, మూత్ర శాలలు, మరుగుదొడ్లు, కనీస మౌలికవసతుల కల్ప నకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. యూడైస్‌ పోర్టల్‌లో పాఠ శాల భవనం, గదులు, విద్యార్థుల వివరాలు, ప్రవేశాల నమోదు, వయస్సు, తరగతి, ఆధార్‌, అపార్‌ వివరాలు, ఉపాధ్యాయుల వివరాలు, సర్వీసు, అర్హత, పోస్టింగ్‌, ప్రదేశాల వివరాలను నమోదు చేయాలని తెలిపారు. ఉపాధ్యా యుల విద్యార్థుల హాజరు వంద శాతం ఉండేలా పర్యవే క్షించాలని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యా బోధన అందించాలన్నారు. ఎంఈవోలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు తమ పరిధిలోని పాఠశాల లను సందర్శించి సదుపాయాలపై పర్యవేక్షించా లన్నారు. పీఎంశ్రీ పాఠశాలలు, సర్వశిక్ష అభియాన్‌ లో వచ్చిన నిధులను కనీసవసతుల కల్పనకు ఖర్చుచేయాలని సూచించారు. సమావేశంలో జిల్లాలోని ఎంఈవోలు, స్కూల్‌కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2026 | 12:00 AM