Kumuram Bheem Asifabad: సొసైటీ ఎదుట రైతుల ఆందోళన
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:18 AM
బెజ్జూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): సొసైటీ ద్వారా రుణాలు తీసుకోకున్నా నోటీసులు ఎలా ఇస్తారంటూ రైతు లు సొసైటీ ఎదుట ఆందోళనకు దిగారు.
బెజ్జూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): సొసైటీ ద్వారా రుణాలు తీసుకోకున్నా నోటీసులు ఎలా ఇస్తారంటూ రైతు లు సొసైటీ ఎదుట ఆందోళనకు దిగారు. సోమవారం పలు గ్రామాలకు చెందిన రైతులు మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘం ఎదుట ఆందోళన చేశారు. బాధితరైతుల వివరాల ప్రకారం.. బెజ్జూరు, పెంచికలపేట మండలాల్లోని పలుగ్రామాలకుచెందిన రైతులు 2018,2019 లో సొసైటీద్వారా రుణాలు తీసుకున్నట్లు అధికారులు నోటీ సులు అందజేశారు. 26నసొసైటీకి రావాలంటూ పేర్కొన్నా రని, ఇక్కడికివస్తే సిబ్బంది ఎవరూలేరని, ఫోన్లుచేస్తే స్పందించడం లేదని వాపోయారు. తాము రుణాలు తీసుకో లేదని, తీసుకున్నట్లు అధికారులు నోటీసులు జారీచేయ డంపై మండిపడ్డారు. ఈవిషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసు కెళ్తామన్నారు. తాముతీసుకోని రుణాలను ఎట్టి పరిస్థితుల్లో చెల్లించేది లేదన్నారు. అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.