Share News

Kumuram Bheem Asifabad: జిల్లాలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:32 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఆదివారం దీపావళి పండగను ఘనంగా జరుపుకున్నారు. తమ తమ ఇళ్లలో, వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో లక్ష్మీపూజలు నిర్వహించారు.

Kumuram Bheem Asifabad:  జిల్లాలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు
దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి, నాయకులు

- విద్యుత్‌ దీపకాంతుల్లో మెరిసిన ఇళ్లు, వ్యాపార సముదాయాలు

- ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేసిన మహిళలు

ఆసిఫాబాద్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఆదివారం దీపావళి పండగను ఘనంగా జరుపుకున్నారు. తమ తమ ఇళ్లలో, వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో లక్ష్మీపూజలు నిర్వహించారు. చిన్నాపెద్ద తేడా లేకుండా బాణాసంచా కాల్చారు. జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాలతో పాటు మండలాల్లో దీపావళి పండగను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో వ్యాపార, వాణిజ్యసమూదాయాల్లో విద్యుత్‌దీపాలతో అలంక రించారు. మహిళలు తమ తమ ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. బాణాసంచా విక్రయకేంద్రాలు కిక్కిరిసిపోయాయి. వివిధ రకాల టపాసులు కొనుగొలు చేసేందుకు చిన్నా,పెద్ద తేడా లేకుండా దుకాణాల వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంది. వ్యాపార, వాణిజ్య సముదా యాలలో లక్ష్మీపూజలను నిర్వహించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు బాణసంచా మోతతో జిల్లాకేంద్రం మారుమోగింది. ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసంలో ప్రత్యేకపూజలను నిర్వహించి కుటుంబసభ్యులతో కలిసి వేడు కల్లో పాల్గొన్నారు. కాగజ్‌నగర్‌ పట్టణం సర్‌సిల్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండేవిఠల్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ అకాష్‌, అహ్మద్‌, ఎమ్మెల్యే తనయుడు కోవ సాయినాథ్‌, నాయకులు పాల్గొన్నారు.

జైనూర్‌/సిర్పూర్‌(యు)/వాంకిడి /బెజ్జూరు/కాగజ్‌నగర్‌ /సిర్పూరు(టి)/కౌటాల/చింతల మానేపల్లి/దహెగాం/కెరమెరి /తిర్యాణి/రెబ్బెన: మండలకేంద్రాల్లో, గ్రామాల్లో ఆదివారం దిపావళి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ప్రతీ ఇంటిని రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించడంతో పల్లెలన్నీ కాంతులీనాయి. మహిళలు ఇంటిముందు దీపాలు వెలిగించి లక్ష్మీదేవి, బుద్ధుడి చిత్రపటాలకుపూజలు నిర్వహించారు. సాయంత్రంవేళ కుటుంబ సభ్యులంతా పూజించి మిఠాయిలు పంచుకుంటూ పండుగసంబరాలను జరుపుకున్నారు. కేదారేశ్వర వ్రతాన్ని నోముకున్నారు. చిన్నారులు, యువత టపాకాయలు కాల్చుతూ సందడి చేశారు. గ్రామాల్లో ఎటుచూసినా దీపాల వెలుగులు, పిల్లలు కేరింతలు పండుగ సందడి కనిపించాయి. ఆదివాసీలు గుస్సాడీ, దండారి సంబరాలు జరుపుకుంటూ సంప్రదాయ నృత్యాలు చేశారు. సోమవారం ప్రత్యేకంగా గోపూజ నిర్వహించారు. ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రెబ్బెన మండలం గోలేటిలో దీపావళి వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

Updated Date - Nov 09 , 2026 | 11:32 PM