Kumuram Bheem Asifabad: గుండి వంతెన నిర్మాణం కోసం సచివాలయానికి సైకిల్ యాత్ర
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:16 AM
ఆసిఫాబాద్ రూరల్, అక్టోబరు 26 (ఆంఽధ్ర జ్యోతి): గుండి పెద్దవాగుపై వంతెన నిర్మాణం దశా బ్ధకాలంగా పూర్తికాకపోవడంతో గ్రామస్థులు ఆందో ళనబాట పట్టారు.
ఆసిఫాబాద్ రూరల్, అక్టోబరు 26 (ఆంఽధ్ర జ్యోతి): గుండి పెద్దవాగుపై వంతెన నిర్మాణం దశా బ్ధకాలంగా పూర్తికాకపోవడంతో గ్రామస్థులు ఆందో ళనబాట పట్టారు. వంతెన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండు చేస్తూ గుండి గ్రామం నుంచి హైదరాబాద్‌లోని సచివాలయం వరకు సోమవారం సైకిల్‌యాత్ర చేపట్టారు. గుండి పెద్దవాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి రెండు దశాబ్ధాలు గడుస్తున్నా పనులు పూర్తి కాక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రని గ్రామస్థులు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలని వారు డిమాండు చేశారు. సైకిల్ యాత్రను సర్పంచ్ రవీందర్ జెండా ఊపి ప్రారంభించారు. సైకిల్‌యాత్ర చేస్తున్న యువకు లకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి మద్ద తు ప్రకటించారు. కార్యక్ర మంలో ఉపసర్పంచ్ సంతోష్, గ్రామస్థులు సురేష్, నాగయ్య, వినోద్, అంజన్న, వార్డు సభ్యులు రాజు, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.