Share News

Kumuram Bheem Asifabad:: ఐకేపీ కార్యాలయాన్ని సందర్శించిన కమిషనర్‌

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:15 AM

జైనూర్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం సముదాయాన్ని పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృధ్ధి కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ సోమ వారం సందర్శించారు.

Kumuram Bheem Asifabad::  ఐకేపీ కార్యాలయాన్ని సందర్శించిన కమిషనర్‌
కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న సమాఖ్య అధ్యక్షురాలు మోతుబాయి సర్పంచ్‌ కౌసల్య

జైనూర్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం సముదాయాన్ని పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృధ్ధి కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ సోమ వారం సందర్శించారు. ఈ సంద ర్భంగా సమాఖ్యసభ్యులు కమిషన ర్‌ను సన్మానించారు. ఆనంతరం మండలంలో సమాఖ్యసభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల్ని కమిష నర్‌కు వివరించారు. అదేవిధంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమీషనర్‌కు దుబ్బ గూడ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ మడావి కౌసల్యా భీంరావ్‌ వినతిపత్రం అందజేశారు. త్వరలోనే సమాఖ్య సభ్యుల సమస్యలు పరిష్కరి స్తామని కమిషనర్‌ వారికి హామి ఇచ్చారు. అదేవిధంగా దుబ్బగూడలో తేనెటీగల కేంద్రం పార్రంభించాలని సర్పంచ్‌ కౌసల్యాబాయి కోరారు. దుబ్బగూడకు త్వరలోనే వస్తామని హామీ ఇచ్చారు. తేనెటీగల కేంద్రం ఏర్పాట్లు వేగవంతం చేయాలని వాటికి తగిన సదుపాయాలు కల్పించాలని డీఆర్డీవో దత్తారావ్‌ను కమిషనర్‌ ఆదేశించారు. సమాఖ కార్యదర్శి సుశీల, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 12:15 AM