Share News

Kumuram Bheem Asifabad: ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:59 PM

ఆసిఫాబాద్‌రూరల్‌/బెజ్జూరు/సిర్పూర్‌(యు)/కెరమెరి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినవేడుకలను ఆదివారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాల యంలో కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వ హించాయి.

Kumuram Bheem Asifabad:  ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు
స్వీట్లు తినిపించుకుంటున్న కాంగ్రెస్‌ నాయకులు

ఆసిఫాబాద్‌రూరల్‌/బెజ్జూరు/సిర్పూర్‌(యు)/కెరమెరి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినవేడుకలను ఆదివారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాల యంలో కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వ హించాయి. వేడుకలకు డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ, మాజీడీసీసీ అధ్యక్షుడు విశ్వప్ర సాద్‌రావు, మాజీఎమ్మెల్యే ఆత్రం సక్కు ముఖ్య అతిథులుగా హాజరై కేక్‌ కట్‌ చేశారు. అనం తరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ సీఎం జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాసంక్షేమం, అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజా పాలన సాగిస్తోందన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీచైర్మన్‌ మంగ, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ అబ్దుల్లా, మాజీఎంపీపీ బాలేశ్వర్‌ గౌడ్‌, డీసీసీ జిల్లాఉపాధ్యక్షుడు తారీక్‌, మండల అధ్యక్షులు రాపర్తిమురళీ, నాయకులు జక్కయ్య, మారుతి, తిరుపతి, కళావతి, బాలు, రాము పాల్గొన్నారు. ఫ బెజ్జూరులో కాంగ్రెస్‌పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోండ్ర జగ్గాగౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్దన్‌, సర్పం చులు మల్లేష్‌, చిరంజీవి, చిన్నయ్య, ఉపస ర్పంచ్‌ ఆదర్శ్‌, నాయకులు రామకృష్ణ, శంకర్‌, బూస శంకర్‌, పెంటయ్య, రమేష్‌, శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు. ఫ సిర్పూర్‌(యు)లో జైనూర్‌ మార్కెట్‌కమిటీ చైర్మన్‌ కుడ్మేత విశ్వనాథ్‌ రావు, ఎస్సీసెల్‌ జిల్లా చైర్మన్‌ సుద్దాల శ్రీనివాస్‌ ముఖ్య అతిథులుగా హాజరై కేక్‌కట్‌ చేసి శుంభాకాంక్షలు తెలి పారు. కార్యక్రమంలో నాయ కులు ఆత్రం శంకర్‌,పెందోర్‌ రాము, దేవిదాస్‌, కోట్నాక నాగోరావు, ఆత్రం లచ్చు, ఆత్రం నాగోరావు, సేడ్మకి నాగోరావు పాల్గొన్నారు. ఫ కెరమెరిలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సుజాయిత్‌ ఖాన్‌, ఏఎంసీ డైరెక్టర్‌ సాజిద్‌ దేశ్‌ముఖ్‌, డీసీసీ జిల్లా కార్యదర్శి శంకర్‌ నాయక్‌, జిల్లా మైనార్టీ సెల్‌ సెక్రెటరీ షేక్‌ ఫరూక్‌, షేక్‌ మహ్మద్‌, జిల్లా ఎస్సీ సెల్‌ సెక్రటరి కొలాత్కర్‌ రమేష్‌, మండల వైస్‌ ప్రసిడెంట్‌ సిడాం జగన్నాథ్‌పాల్గొన్నారు.

రెబ్బెన : మండల కేంద్రంలో ఆదివారం సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ కేక్‌కట్‌ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కేసరి కిషన్‌గౌడ్‌, జిల్లా కార్యవర్గసభ్యులు సోమశేఖర్‌, దుర్గం దేవాజీ, టౌన్‌అధ్యక్షుడు దుర్గం రాజేష్‌, మండల ఉపాధ్యక్షుడు బలరాం నాయక్‌, ఎస్సీ సెల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు జాడి ప్రసాద్‌, ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు గోపాల్‌ నాయక్‌, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2026 | 11:59 PM