Share News

Kumuram Bheem Asifabad: ఘనంగా కుమరం భీం, ఎడ్లకొండు జయంతి

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:51 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 22 (ఆంధ్ర జ్యోతి): ఆసిఫాబాద్‌ మండలంలోని రౌటసంకేపల్లి గ్రామంలో గురువారం కుమరంభీం, ఎడ్లకొండు జయంతి వేడుకలను గిరిజన సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో ఘనంగా నిర్వహించారు.

 Kumuram Bheem Asifabad: ఘనంగా కుమరం భీం, ఎడ్లకొండు జయంతి

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 22 (ఆంధ్ర జ్యోతి): ఆసిఫాబాద్‌ మండలంలోని రౌటసంకేపల్లి గ్రామంలో గురువారం కుమరంభీం, ఎడ్లకొండు జయంతి వేడుకలను గిరిజన సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కుమరంభీం, ఎడ్లకొండు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డీడీ జాదవ్‌ అంబాజీ, డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ, మాజీఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఏసీఎంవో పుర్క ఉద్దవ్‌, ఏటీడీవో చిరంజీవి, ఆదివాసీ సంఘాల నాయకులు బుర్స పోచయ్య, సిడాం అర్జు, బక్క య్య, మోతీరాం, తదితరులు పాల్గొన్నారు.

కుమరం భీం

ఆశయాలను కొనసాగించాలి

కాగజ్‌నగర్‌ : కుమరంభీం ఆశయాలను కొనసాగించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహి ళాసంఘం సభ్యులు తెలిపారు. గురువారం భీం జయంతి వేడుకల సందర్భంగా డాడానగర్‌లోని భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల భీం ఆశయాల సాధనకు ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం భీం చేసినసేవల్ని కొనియాడారు. కార్యక్రమంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం అధ్యక్ష, కార్య దర్శులు, కమిటీసభ్యులు, జిల్లాకమిటీ సభ్యులు షాహిన్‌సుల్తాన, వినోద, సులోచన, అనిత తది తరులు పాల్గొన్నారు.

వాంకిడి : ఆదివాసుల ఆరాధ్య దైవం కుమరం భీం జయంతిని గురువారం మండలంలోని బంబా ర, వాంకిడి గ్రామాల్లో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గిరిజ నుల హక్కుల కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. వాంకిడి కార్య క్రమంలో సీడీపీవో విజయలక్ష్మి, గ్రంథా లయం సబార్డినేట్‌ అశోక్‌, పాఠకులు, పాల్గొనగా బంబార గ్రామంలో సర్పంచ్‌ కృష్ణాజీ, ఉపసర్పంచ్‌ సంతోష్‌, వార్డుసభ్యులు సాలక్క, కోట్నాక సుబ్బాం, కిరణ్‌, కేశవరావు, తదితరులు పాల్గొన్నారు.

కౌటాల : కౌటాల విద్యావనరుల కేంద్రంలో కుమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంఈవో నానాజీ, ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యా యుడు హన్మంతు, చింతలమానేపల్లి ఎంఈవో జయ రాజ్‌, ఆదివాసీ టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కోశాధికారి నైతం జాయినాథ్‌, మండల అధ్య క్షుడు మడావి పోచాని, ఉపాధ్యక్షుడు ఆశోక్‌, రాములు, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 11:51 PM