Share News

Kumram Bheem Asifabad: ఇంకుడుగుంతల నిర్మాణంలో మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలి

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:04 AM

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): భూగర్భజలనీటి మట్టాన్ని పెంపొందించే విధంగా ఇంకుడుగుంతల నిర్మాణాలను చేపట్టి స్వయం సహా యకసంఘాల మహిళలను

 Kumram Bheem Asifabad:  ఇంకుడుగుంతల నిర్మాణంలో మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలి

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): భూగర్భజలనీటి మట్టాన్ని పెంపొందించే విధంగా ఇంకుడుగుంతల నిర్మాణాలను చేపట్టి స్వయం సహా యకసంఘాల మహిళలను భాగస్వాములను చేయా లని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్‌ రైతువేదికలో డీఆర్డీవో దత్తా రావుతోకలిసి ఎల్‌నినో ప్రభావం, ఫారంపాండ్‌, సామా జిక ఇంకుడుగుంతల నిర్మాణం, ఆరుతడిపంటల సాగు విద్యార్థులకు యూనిఫాంపంపిణీ అంశాలపై సంబంధి తశాఖల అధికారులతో, సామాజిక సమన్వయకర్తలతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎల్‌నినో ప్రభావం కారణంగా లోటువర్షపాతం ఉందని కరువును ఎదుర్కోవాలంటే ప్రతివర్షపు నీటి బొట్టును భూమి లో ఇంకిపోయేలా ఇంకుడు గుంతలు, ఊటకుంటలు వీబీజీ రాంజీ పథకం కింద యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. వరిసాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగుచేయాలని ఈ విషయమై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆగస్టు15లోగా విద్యార్థులకు రెండుజతల యూనిఫాం అందజేయలన్నారు.

అనంతరం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తనమేళాను సందర్శించి విత్తన ప్యాకెట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఏ మిలింద్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2026 | 12:11 AM