Kumram Bheem Asifabad: భూ రీసర్వేకు ప్రతిమండలానికి రెండుబృందాలను ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:34 PM
ఆసిఫాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వేకు ప్రతి మండలం నుంచి డిప్యూటీ తహసీల్దార్, గిర్ధావర్ లేదా సీనియర్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో సర్వేయర్లతో కూడిన రెండు బృందాలను ఏర్పాటు చేయాలని చీఫ్ కమిషనర్ ల్యాండ్,రెవెన్యూ లోకేష్ అన్నారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వేకు ప్రతి మండలం నుంచి డిప్యూటీ తహసీల్దార్, గిర్ధావర్ లేదా సీనియర్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో సర్వేయర్లతో కూడిన రెండు బృందాలను ఏర్పాటు చేయాలని చీఫ్ కమిషనర్ ల్యాండ్,రెవెన్యూ లోకేష్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి ఉన్న తాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిమండలం నుంచి భూముల రీసర్వేకు నాయబ్ తహసీల్దార్, గిర్ధావర్, సీనియర్ అసిస్టెంట్ స్థాయిలో రెండు బృందాలను ఏర్పాటు చేసి ప్రతి బృందంలో సర్వేయర్, గుర్తింపు పొందిన సర్వేయర్ ఉండే విధంగా చర్యలు తీసుకో వాలని తెలిపారు. సర్వే చేసే విధానం యంత్రాల వినియోగంపై వీరికి అవగాహన కలిగి ఉండేలా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. భూభారతిలో సవరణ కొరకు వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంలో భూసేకరణ వేగ వంతం చేయాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపుకలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్షచౌదరి, సర్వేల్యాండ్ రికార్డు ఏడీ వినయ్ పాల్గొన్నారు.