Kumram Bheem Asifabad: వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:15 PM
ఆసిఫాబాద్ రూరల్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థి దశనుంచే అవ గాహన కలిగి ఉండాలని డీప్యూటీ రేంజ్‌అధికారి మోగేష్ కులకర్ణి అన్నారు.
ఆసిఫాబాద్ రూరల్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థి దశనుంచే అవ గాహన కలిగి ఉండాలని డీప్యూటీ రేంజ్‌అధికారి మోగేష్ కులకర్ణి అన్నారు. వన్యప్రాణి సంరక్షణ వారోత్స వాలలో భాగంగా జిల్లా కేంద్రంలోని పీటీజీ బాలురపాఠశాలలో సోమ వారం ఉపన్యాస పోటీలను నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశనుంచి పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమ తుల్యం లాంటి అంశాలపై అవగాహన కలిగి ఉండా లన్నారు. పోటీల్లో 40మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సెక్షన్‌అధికారి మహేందర్, బీట్‌అధికారి ప్రకాష్, పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత, వార్డెన్ కృష్ణచారి తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు : మండలకేంద్రంలోని జిల్లాపరిషత్ పాఠశాలలో బెజ్జూరు సెక్షన్ అధికారి సాఫియాబేగం విద్యార్థులకు వన్యప్రాణి డాక్యుమెంటరీ వీడియోలను ప్రదర్శించి వన్యప్రాణుల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ఎంఈవో సునీత, సెక్షన్‌అధికారి సంతోష్, బీట్ అధికారి స్రవంతి తదితరులు ఉన్నారు.
సిర్పూరు(టి): సిర్పూరు(టి)లోని సాంఘిక సంక్షే మ ఉన్నతపాఠశాలలో ఉపన్యాసపోటీలు నిర్వహిం చారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్ర మంలో ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్, డీఆర్వో తిరుపతి, సెక్షన్ అధికారులు బాలాజీ, మోహన్‌రావు, తులసీదాస్ నాయక్, అతారుద్దీన్, అక్తర్, రజిత, బీట్ అఽధికారులు, వాచర్లు, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్‌లో బైక్‌ర్యాలీ నిర్వ హించారు. కార్యక్రమంలో పెంచికల్‌పేట్‌రేంజ్ డీఆ ర్వోలు ముసావీర్, అస్మా, ఎఫ్‌ఎస్‌వో అహ్మద్ అలీ, బీట్‌అధికారులు సతీష్, సంగదీప్, కళ్యాణ్; లచ్చన్న, స్వర్ణలత, శిరీష,ఎనిమల్‌ట్రాకర్స్,సిబ్బంది పాల్గొన్నారు.
కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్టు డివిజనల్ అధికారి బార్గవ్ కుమార్, ఎఫ్‌ఆర్వోలక్ష్మీనారాయణ మాట్లాడుతూ వన్య ప్రాణుల సంరక్షణకు అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో బీట్‌అధికారులు రవికుమార్, గిరిబాబు, బానయ్య, జోగు, ఎల్లం, ప్రభుత్వకళాశాల ప్రిన్సిపాల్ టి శ్రీదేవి, ఉపాధ్యాయులు,సిబ్బంది పాల్గొన్నారు.