Share News

Kumram Bheem Asifabad: విద్యాప్లస్‌ కార్యక్రమాన్ని మరింత విస్తరించాలి

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:44 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 7 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, విద్యార్థుల విద్యా సామర్థ్యాలు పెంపొందిం చేందుకు ప్రవేశపెట్టిన విద్యాప్లస్‌ కార్యక్రమాన్ని మరింత విస్తరించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సూచిం చారు.

Kumram Bheem Asifabad: విద్యాప్లస్‌ కార్యక్రమాన్ని మరింత విస్తరించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 7 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, విద్యార్థుల విద్యా సామర్థ్యాలు పెంపొందిం చేందుకు ప్రవేశపెట్టిన విద్యాప్లస్‌ కార్యక్రమాన్ని మరింత విస్తరించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సూచిం చారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నతపాఠశాలలో కలెక్టర్‌ హరితతో కలిసి సోమవారం విద్యాప్లస్‌ కార్యక్రమాన్ని ప్రారంభిం చి ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాప్లస్‌ పక్కా గా అమలైతే విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. దీనిని జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమలు చేసే విధంగా ప్రయత్నాలు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడ దీనిపై చర్చించను న్నట్లు తెలిపారు. వెనుక బడిన జిల్లాల్లో విద్యా ప్రమాణాలు పెంచేందు కు అదనపుకలెక్టర్‌ చేస్తు న్న కృషిని అభినందిం చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ ప్రాజెక్టు గురించి పవర్‌పాయింట్‌ ప్రెజెంటెషన్‌ ద్వారా వివ రించారు. అనంతరం పాఠశాలలోనే ఉన్న పోలింగ్‌ బూత్‌ల వద్ద హియరింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. మిస్‌మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి గడువులోగా పూర్తి చేయలన్నారు. ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఇంకా ఎన్నిపెండింగ్‌లో ఉన్నాయని బీఎల్‌వో లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఎంఈవో రాథోడ్‌ సుభాష్‌, తహసీల్దార్‌ రీయాజ్‌ ఆలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2026 | 11:44 PM