Kumram Bheem Asifabad: హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Sep 07 , 2026 | 11:41 PM
ఆసిఫాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేకసమగ్రసవరణలో హియరింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టా లని రాష్ట్రవిద్యాశాఖ కార్యదర్శి, ఎస్‌ఐఆర్ పరిశీలకురాలు యోగితా రాణా అన్నారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేకసమగ్రసవరణలో హియరింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టా లని రాష్ట్రవిద్యాశాఖ కార్యదర్శి, ఎస్‌ఐఆర్ పరిశీలకురాలు యోగితా రాణా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ హరిత సంబంధితశాఖల అధికారు లతోకలిసి హియరింగ్ ప్రక్రియ, నోటీసుల జారీ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మ్యాపింగ్ కాని అనామ లిస్ జాబితాలో గల ఓటర్లకు నోటీసులు త్వరగా జారీచేసి హియరింగ్ ప్రక్రి యను పూర్తిచేయలన్నారు. కలెక్టర్ హరిత మాట్లాడుతూ ఎన్నికల సంఘం కార్యచరణప్రకారం హియరింగ్ ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు.
రాజకీయ పార్టీలు సహకరించాలి..
హియరింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని యోగితా రాణా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ హరితతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హియరింగ్‌ప్రక్రియలో నోటీసులు అందుకున్నవారు తప్పకుండా అవసరమైన 11రకాల ధ్రువపత్రాలలో ఏదైనా ఒకటి సమర్పించవలసి ఉంటుందన్నారు. రాజకీయపార్టీల ప్రతినిధులు ఓటర్లకు అవగాహన కల్పించా లని బూత్‌స్థాయి ఏజెంట్లను హియరింగ్ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని తెలిపారు. ఆయా సమావేశాల్లో అదనపుకలెక్టర్ యువరాజ్ మర్మాట్, సబ్‌కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవోలోకేశ్వర్‌రావు, ట్రైనీడిప్యూటీకలెక్టర్ జాస్తీన్‌జోయల్, తహసీల్ధార్లు రాజ కీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.