Share News

Kumram Bheem Asifabad: కాంగ్రెస్‌ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలి

ABN , Publish Date - Aug 26 , 2026 | 11:51 PM

చింతలమానేపల్లి/కౌటాల, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షు రాలు ఆత్రం సుగుణ అన్నారు.

 Kumram Bheem Asifabad:  కాంగ్రెస్‌ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలి

- డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

చింతలమానేపల్లి/కౌటాల, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షు రాలు ఆత్రం సుగుణ అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండేవిఠల్‌తో కలిసి చింతలమానేపల్లి, కౌటాలలో కాంగ్రెస్‌పార్టీ మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌లో భాగంగా మండలకమిటీ ఎన్నికకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త తన వంతుగా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ దండేవిఠల్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతిఇంటింటా అవగా హన పర్చాల్సిన బాధ్యత ప్రతికార్యకర్తపై ఉందన్నారు. ఆయా కార్యక్ర మాల్లో మార్కెట్‌కమిటీ చైర్మన్‌ సుద్దాల దేవయ్య, మాజీజడ్పీచైర్మన్‌ సిడాం గణపతి, మండల అధ్యక్షుడు డుబ్బుల నానాయ్య, వెంకయ్య, బండి మహేష్‌, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2026 | 11:51 PM