Share News

Kumram Bheem Asifabad: బాల్య వివాహాల నిర్మూలనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

ABN , Publish Date - Sep 05 , 2026 | 11:25 PM

వాంకిడి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): బాల్యవివాహాల నిర్మూలనలో ఉపాధ్యాయులపాత్ర కీలకమని డీసీపీవో బూర్లమహేష్‌ పేర్కొన్నారు.

 Kumram Bheem Asifabad:  బాల్య వివాహాల నిర్మూలనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

- డీసీపీవో మూర్ల మహేష్‌

వాంకిడి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): బాల్యవివాహాల నిర్మూలనలో ఉపాధ్యాయులపాత్ర కీలకమని డీసీపీవో బూర్లమహేష్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల్యవివాహాల నిర్మూలనలో ఉపాధ్యా యులపాత్ర అనే అంశంపై ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యాబోధనతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం, భద్రత, భవిష్యత్‌ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలన్నారు. బాల్యవివాహంవల్ల బాలికల విద్యకు ఆటంకం కలగడంతో పాటు వారి ఆరోగ్యం, మానసికస్థితి, భవిష్యత్‌ అవకా శాలు, సామాజిక భద్రతపై తీవ్రప్రభావం పడుతుంద న్నారు. బాల్యవివాహాల నివారణకు ప్రతిఒక్కరూ సహక రించాలని కోరారు. కార్యక్రమంలో డీపీసీయూ ప్రొటెక్షణ్‌ అధికారి శ్రావణ్‌కుమార్‌, చైల్డ్‌హెల్ప్‌లైన్‌ సూపర్‌వైజర్‌ పీతాంబర్‌, ఎయిడ్‌ స్వచ్ఛందసంస్థ కోఆర్డినేటర్‌ బండి సంతోష్‌ కుమార్‌, ఎంఈవో వివచరణ్‌కుమార్‌, కేజీబీవీ ఎస్‌వో రైసా ఖాతూన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 11:25 PM