Share News

Kumram Bheem Asifabad: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:57 PM

ఆసిఫాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, సిబ్బంది తమవిధుల పట్లనిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె హరిత అన్నారు.

Kumram Bheem Asifabad: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, సిబ్బంది తమవిధుల పట్లనిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. గురువారం కలెక్టరేట్‌ లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీచేసి ఉద్యోగులు సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉద్యోగులు విధుల పట్ల సమయపా లన పాటించాలని ప్రజలకు మెరుగైనసేవలు అందిం చాలని తెలిపారు. విధుల్లోనిర్లక్ష్యం వహించే సిబ్బం దిపై చర్యలకు ఉపేక్షించేదిలేదని అన్నారు. అనుమతి లేకుండా విదులకు గైర్హాజరయ్యే వారిపై చర్యలు తీసుకుంటామని తెలి పారు.

ఆరోగ్యపరీక్ష పరికరాలను

వినియోగించాలి..

జిల్లాలోని పీహెచ్‌సీలలో ఆరోగ్యపరీక్ష పరికరా లను వినియోగించి పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. గురువారం కలె క్టరేట్‌లో స్ర్కీనింగ్‌ పరికరాల విని యోగంపై ల్యాబ్‌ టెక్నీషియన్లు, స్టాఫ్‌నర్సులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి డీఎంహెచ్‌వో నాగేంద్రతోకలిసి హాజరై మాట్లా డారు. కార్పొరేట్‌ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా హిందు స్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ వారి ఆధ్వ ర్యంలో ఒమ్ని అక్యూ కేర్‌ ఫౌండే షన్‌ వారి సహకారంతో హెల్త్‌ ప్రాజెక్టు కంట్రీబ్యూషన్‌లో భాగంగా అందించిన హెల్త్‌ స్ర్కీనింగ్‌ పరికరాలు, మల్టీ పారామెట్రిక్‌ డయాగ్నోస్టిక్‌ డివైజ్‌లను వినియోగించుకొని ఆరోగ్య కేంద్రాలకు చికిత్సలకోసం వచ్చే రోగులకు పరీక్షలు నిర్వహించి మెరుగైనవైద్యం అందించాలని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 8 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు అందించామని అన్నారు. పరికరాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మారుమూల గ్రామాల ప్రజలకు ఉత్తమమైన వైద్యసేవలు అందిం చాలని తెలిపారు. కార్యక్రమంలో అకాంక్షిత బ్లాక్‌ సమన్వయకర్త డాక్టర్‌ బాలరాజు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2026 | 11:57 PM