Share News

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్‌ కె. హరిత హెచ్చరిక

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:56 PM

కాగజ్‌నగర్‌, ఆగస్టు 6 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె హరిత అన్నారు.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్‌ కె. హరిత హెచ్చరిక

- కలెక్టర్‌ కె హరిత

కాగజ్‌నగర్‌, ఆగస్టు 6 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. గురువారం కాగజ్‌నగర్‌ మండలం కోసిని గ్రామశివారులో 79, 80సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిని ఆర్డీవో కిష్ణయ్యతో కలిసి పరిశీ లించారు. కాగజ్‌నగర్‌ సర్‌సిల్క్‌ ఏరియాను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో వెంచర్‌ చేసి ప్లాట్లుగా విక్రయించారన్న ఆరోపణల మేరకు కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ ఆస్తులకు హద్దులు నిర్ధారించి వెంటనే స్వాధీనపర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే మున్సిపల్‌ పరిధిలోని 15వవార్డు కాపు వాడలో ఓ వ్యక్తి రహదారిని ఆక్రమించి ప్లాట్లు చేశారని ఫిర్యాదుపై కూడా విచారణ జరిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మధూకర్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఈవీఎం గోదాం తనిఖీ..

ఆసిఫాబాద్‌ : జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను గురువారం సాధారణ తనిఖీల్లో భాగంగా కలెక్టర్‌ కె హరిత తనిఖీచేశారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన ఈవీఎంల నిర్వహణ, భద్రత ఏర్పాట్లు సీసీటీవీ నిఘా, అగ్నిమాపక పరికరాలు తదితర అంశాలను పరిశీలించి భద్రతకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Aug 13 , 2026 | 02:34 PM