Share News

Kumram Bheem Asifabad: ముగిసిన రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలు

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:32 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ జిల్లాకేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో మూడురోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి నెట్‌ బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు సోమవారం ముగిశాయి.

 Kumram Bheem Asifabad:   ముగిసిన రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలు

ఆసిఫాబాద్‌ రూరల్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ జిల్లాకేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో మూడురోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి నెట్‌ బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు సోమవారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై విజేత లకు ట్రోఫీలు, మెడల్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసిఫా బాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన పోటీల్లో ఆసిఫాబాద్‌ జట్టు ఛాంపియన్‌గా, రన్నర్‌గా కూడా ఆసిఫాబాద్‌ జట్టు రావటం గర్వకారణమని తెలిపారు. విజేత లకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌చైర్మన్‌ అకాష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సాలం, నాయకులు రవీందర్‌, జీవన్‌, అహ్మద్‌ బీన్‌ అబ్దుల్లా, నెట్‌ బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిత్య, ప్రిన్సిపాల్‌ మహేశ్వర్‌ తదితరులు పాల్గొ న్నారు.

Updated Date - Oct 12 , 2026 | 11:32 PM