Kumram Bheem Asifabad: టీఫైబర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:48 PM
ఆసిఫాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో టీఫైబర్ అభివృద్ధి పై ప్రత్యేకదృష్టి సారిస్తామని కలెక్టర్ అన్నారు.
ఆసిఫాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో టీఫైబర్ అభివృద్ధి పై ప్రత్యేకదృష్టి సారిస్తామని కలెక్టర్ అన్నారు. సోమవారం కలెక్టరే ట్‌లో టీ ఫైబర్ విస్తరణపై రెవెన్యూ, అటవీ, టెలికాం సంస్థల అధికా రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వకార్యాలయాలు, విద్యసంస్థల్లో ఇంట ర్నెట్ సేవలు మరింత సౌకర్యవంతంగా అందించేందుకు అధికారులు సమన్వయంతో కృషిచేయాలని తెలిపారు. ఈనేపథ్యంలో సంబందిత శాఖల అధికారులు జిల్లాలో టీఫైబర్ సేవలు సమ్రగంగా అందించేం దుకు గాను అనుమతుల కోసం నివేదికలు సిద్ధంచేసి రాష్ట్ర అధికారు లకు పంపించాలని తెలిపారు. సమావేశంలో అదనపుకలెక్టర్ డేవిడ్, డీఎఫ్‌వో బాలమణి ఆర్డీవోలు లోకేశ్వర్‌రావు, కృష్ణయ్య, టీఫైబర్ అద నపు సంచాలకుడుశ్రీనివాస్, మేనేజరుసురేష్ తదితరులు పాల్గొన్నారు.
భూముల రీసర్వేతో భవిష్యత్‌లో వివాదాలు ఉండవు..
ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేతో భవిష్యత్‌లో భూవివాదాలు ఉండవని కలెక్టర్ హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో భూము ల రీసర్వేపై జిల్లాలోని తహసీల్దార్లు, సర్వేయర్లు, ఆర్‌ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో రీ సర్వే కోసం ఎంపిక చేసిన గ్రామాలలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సర్వేనిర్వహిం చాలని అన్నారు. మొదటి విడతలో జిల్లాలో గ్రామనక్షలు లేని 37 గ్రామాలు ఉన్నాయని, రెండోవిడతలో 70గ్రామాలు ఎంపికచేశామ న్నారు. మొదటివిడతలో ఎంపికచేసిన గ్రామాల్లో సర్వే నిర్వహించ డంతోపాటు గ్రామనక్ష రుపొందిస్తామని రెండోవిడతలో ఎంపికైన గ్రామాల్లో రీసర్వేలో భాగంగా ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహిస్తామని తెలిపారు. సర్వే ఉద్ధేశం ప్రజలకు వివరించి ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. సర్ ప్రక్రియలో జిల్లా మంచిస్థానంలో ఉందని ప్రస్తు తం 67శాతంఫారాల డిజిటలైజేషన్ జరిగిందని 100శాతం పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపుకలెక్టర్ డేవిడ్, డీఆర్వో వేణు, ఆర్డీవోలు లోకేశ్వర్‌రావు, కిష్టయ్య, ఏడీ వినయ్ తహసీల్దార్లు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.