Kumram Bheem Asifabad: గిరిజన గ్రామాల్లో రాపిడ్ ఫీవర్ సర్వే
ABN , Publish Date - Jul 06 , 2026 | 11:43 PM
వాంకిడి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చౌపన్‌గూడ, ఖానాపూర్ గ్రామాల్లో సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించారు.
వాంకిడి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చౌపన్‌గూడ, ఖానాపూర్ గ్రామాల్లో సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ గ్రామంలో ఇంటింటిసర్వే నిర్వహించి వర్షాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిస రాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించక పోవడం వల్ల వచ్చే అంటూ వ్యాధులపై సూచనలు ఇచ్చారు. అనం తరం వైద్యశిబిరంలో ప్రజలకు పరీక్షలు నిర్వహించి రక్తనమునాలను సేకరించారు. అలాగే చౌపన్‌గూడ గ్రామంలోని ఆశ్రమపాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. పాఠ శాలలో పరిశుభ్రత లోపించకుండా చూడాలని సూచిం చారు. కార్యక్రమంలో హెచ్‌ఈవో రవిదాస్, ప్రధానో పాధ్యాయుడు మనోహర్, ఏఎన్‌ఎం గోదుబాయి, ఆశా వర్కర్ జంగుబాయి తదితరులు పాల్గొన్నారు.
జైనూర్ : వర్షాలు పడుతున్న నేపథ్యంలో వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి మురళీకృష్ణ అన్నారు. మండలంలోని లేండిగూడ, గౌరి తదితర గ్రామాల్లో సోమ వారం వైద్యశిబిరం నిర్వహించారు. వంద మంది శిబిరంలో పాల్గొనగా వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు. రక్త నమూనాలను సేకరించారు. హెచ్‌ఈవో పవార్ దిలిప్‌కుమార్ ఆయా గ్రామప్రజలకు ఆరోగ్య భద్రతపై సలహా సూచనలు అందజేశారు. కార్యక్రమంలో సీహెచ్‌వో తొడసం రాజు, హెచ్‌ఎలు లాల్‌సింగ్, జల్పత్, పర్శరాం, ఏఎన్‌ఎం భూలక్ష్మీ, గ్రామ కార్యదర్శి ఆశాలు, గ్రామస్థులు పాల్గొన్నారు.