Share News

Kumram Bheem Asifabad: రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:55 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాని కి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించా లని అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు.

Kumram Bheem Asifabad:   రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాని కి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించా లని అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. గురువారం మండలంలోని అడ పీహెచ్‌సీ, ప్రభుత్వపాఠశాల, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని అకస్మి కంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మందులను పరి శీలించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థుల హాజరు, తరగతి గదులు, మధ్యాహ్నభోజన నాణ్యతను పరిశీలించారు. గ్రామపంచాయతీ రికార్డు లను పరిశీలించి గ్రామంలో చేపడుతున్న పారిశుధ్య పనులు తదితర అంశాలపై సిబ్బందితో సమీక్షించారు. వర్షాకాలం దృష్ట్యా దోమల నివార ణకు క్రమం తప్పకుండా ఫాగింగ్‌, బ్లీచింగ్‌ పిచికారి చేపట్టాలని ఆదేశిం చారు. కార్యక్రమంలో ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2026 | 11:55 PM