Kumram Bheem Asifabad: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:09 AM
వాంకిడి, సెప్టెం బరు 26 (ఆంధ్ర జ్యోతి): గిరిజన విద్యార్థు లకు నాణ్యమైన విద్య అందిస్తూ వారి విద్యాప్రమాణాలు మెరుగు పరిచేం దుకు ఉపాధ్యా యులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లాగిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అంబాజీ సూచించారు.
- జిల్లా గిరిజన సంక్షేమశాఖ డీడీ అంబాజీ
వాంకిడి, సెప్టెం బరు 26 (ఆంధ్ర జ్యోతి): గిరిజన విద్యార్థు లకు నాణ్యమైన విద్య అందిస్తూ వారి విద్యాప్రమాణాలు మెరుగు పరిచేం దుకు ఉపాధ్యా యులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లాగిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అంబాజీ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నతపాఠశాలలో ఆసిఫాబాద్, వాంకిడి, మోవాడ్ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యా యులకు సమీక్ష సమావేశాన్ని నర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల విద్యాప్రగతి, అభ్యసన సామర్థ్యాలు, పాఠ్యాంశాల బోధన, పాఠశాలల నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలన్నారు.
ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థుల విద్యాభివృద్దిపై ప్రత్యేకశ్రద్ద వహించా లని పేర్కొన్నారు. సమావేశంలో ఏసీఎంవో ఉద్దవ్, ఏటీడీవో చిరంజీవి, డీఎస్‌వో మడావి శేఖు, స్కూల్‌కాంప్లెక్స్ హెచ్‌ఎం నారాయణ మూర్తి, ఇందిర, లింబారావు, ఎస్‌ఆర్‌పీలు రవీం దర్, మనోహర్, అనంత్‌రావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.